చిరు, బాలయ్య- నేటి సినిమా విశ్లేషణ

Neticinema Analysis on Chiru and Balakrishna's Movies

సంక్రాంతి బరిలో ఉన్న అసలుసిసలైన కోడి పుంజులు గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీ మాత్రమే అని చెప్పవచ్చు. కాగా ఈ రెండు పుంజులు తమ బలాలు చూపిస్తాయే తప్ప ఏదీ చావదని అర్థమంది( ఇది సరదాగా రాసినదే కానీ కోడిపుంజుల ఆటను మేము ప్రోత్సహించట్లేదని గమనిక) రెండు సినిమాలు ఖచ్చితంగా చూడవలసిన చిత్రాలు. దానికి కారణం ఏమంటే ఒకటి చిరంజీవి 9 సంవత్సరాల తరువాత నటించిన చిత్రం. చిరు డ్యాన్సులు, డైలాగ్స్ ఇంకా హుమర్ అంటే అటు అభిమానుల్లో, ఇటు ప్రేక్షకులలో ఎనలేని క్రేజ్. అంతేకాకుండా ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా పాటలకు విశేష స్పందన రావడం ఈ మధ్యకాలంలో ఏ సినిమాకు జరగలేదు. ఎందుకంటే అన్ని పాటలు హిట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. స్వయానా కొడుకుక రాంచరణ్ నిర్మాత అవ్వడం, మొత్తం మెగాఫ్యామిలీ మరియు అభిమానులు అండగా నిలవడం ఈ సినిమాకు ఇస్తున్న ప్రచారం దానికి వస్తున్న స్పందన చూస్తుంటే ఖచ్చితంగా కొన్ని రికార్డులు సృష్టించేలా కనిపిస్తుంది.

మెగా కాంపౌండ్ నునండి వచ్చిన క్రిష్, కంచె తరువాత తన స్టామినా ఏంటో రుచి చూపించాడు. అటువంటి డైరెక్టర్ తో గౌతమీపుత్ర శాతకర్ణి తెరకెక్కింది. దానికితోడు బాలకృష్ణ శాతకర్ణిగా నటించడం ఆయనను అలా చూసి ఎన్టీఆర్ సైతం కామెంట్, శాతకర్ణి అంటే ఇలానే ఉండేవాడని ఊహించుకున్నట్లే ట్రైలర్ లో అద్భుతంగా కనిపించడం ఈ సినిమా ఖచ్చితంగా చూడవలసిన లిస్టులో చేరిపోయింది. దానికి తోడు అద్భుతంగా ఈ సినిమాకి ఫంక్షన్స్ నిర్వహించారు. సెన్సార్ లో ఒక కట్ కూడా లేకుండా బయటపడింది. తెలంగాణ ప్రభుత్వం ట్యాక్స్ ఫ్రీ చేసింది.

ఇదిలా ఉంటే ఇరు హీరోల ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న యుద్ధం చూసి నాగబాబు మరో విషయం చెప్పడం జరిగింది. సంక్రాంతి మూడు సినిమాల వరకు సూపర్ హిట్ ఇవ్వగల సత్తా ఉందని, ఒక సినిమా హిట్, మరో సినిమా ఫట్ అని కోరుకోవద్దని కోరారు. నేటి సినిమా ఇక్డ గమనించిన విషయం ఏమిటంటే పోటాపోటీగా సోషల్ మీడియాలో అభిమానులు రెండ సినిమాలకు సపోర్ట్ చేస్తున్నారు. కాగా చిరంజీవికి సహజంగానే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉండటం కారణంగా కొంత ఎక్కువ సపోర్ట్ ఉండటం గమనించాము. ఏది ఐమైనా ఈ రెండు సినిమాలు సగటు తెలుగు ప్రేక్షకులను సంక్రాంతికి ఆనందంలో ఉంచడం ఖాయం.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.