సునీల్ 2 కంట్రీస్ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్

సినిమా : 2 కంట్రీస్
నటీనటులు : సునీల్, మనీషా రాజ్, సంజనా, పృథ్వీ, రాజా రవీంద్ర, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు
కథ, నిర్మాణం, దర్శకత్వం : ఎన్.శంకర్
సంగీతం : గోపీ సుందర్
రిలీజ్ డేట్ : 28-12-2017

కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్ ప్రస్తుతం కెరీర్‌లో గడ్డు కాలం ఎదుర్కుంటున్నాడు. వరుస ఫ్లాపులతో ఆడియెన్స్‌కు చిరాకు తెప్పిస్తున్న సునీల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ‘2 కంట్రీస్’ చిత్రంతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మలయాళంలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ‘2 కంట్రీస్’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఇక ఈ సినిమాను దర్శకుడు ఎన్.శంకర్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి బజ్ ఏర్పడింది. మరి ఈ సినిమా అందరి అంచనాలను అందుకుని సునీల్‌కు హిట్ అందించిందో లేదో రివ్యూలో చూద్దాం.

కథ :
వెంకటాపురంలో పచ్చి మోసగాడుగా పేరు తెచ్చుకుంటాడు ఉల్లాస్(సునీల్). అతడు ఏ పని చేయకుండా కోట్లకు పడగెత్తాలని చూస్తుంటాడు. నమ్మిన వారిని నట్టేట ముంచడం ఇతడికి వెన్నతో పెట్టిన విద్య. ఇక ఇదే గ్రామానికి చందిన పటేల్(షాయాజి షిండే) చెల్లెలు అవిటితనంతో బాధపడుతుంది. ఆమెను సునీల్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తాడు పటేల్. ఈ క్రమంలో వారి పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేస్తారు. అయితే చివరి క్షణంలో సునీల్‌కు అమెరికాకు చెందిన ఓ ధనవంతురాలు లయ(మనీషా రాజ్) సంబంధం రావడంతో పటేల్ చెల్లెల్ని పెళ్లి చేసుకోలేకపోతాడు. లయతో సునీల్ పెళ్లి జరిగిపోతుంది.

సునీల్ చిన్నప్పటి స్నేహితురాలే ఈ లయ అని అతడు తెలుసుకుంటాడు. అయితే లయ తాగుడుకి బానిస. పెళ్లి తరువాత సునీల్‌ను నానా చిత్ర హింసలకు గురి చేస్తుంది లయ. అయినా తనకు ఇష్టమైన అమ్మాయి కావడంతో సునీల్ ఇవన్నీ భరీస్తూ వస్తాడు. ఇక ఒకానొక సమయంలో సునీల్ తనను కేవలం డబ్బుకోసమే పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుంటుంది లయ. ఆ తరువాత వారి మధ్య ఎలాంటి విభేదాలు వచ్చాయి..? లయ, సునీల్‌లు ఎలాంటి పరిణామాలను ఎదుర్కుంటారు? చివరికి లయ, సునీల్ విడాకులు తీసుకుంటారా లేక కలిసిపోతారా? అనేది మిగతా స్టోరీ.

విశ్లేషణ :
భార్యాభర్తల సంబంధానికి ప్రతీకగా ‘2 కంట్రీస్’ చిత్రాన్ని తెరకెక్కించారు చిత్ర యూనిట్. ఈ కథలో కొత్తదనం ఏమీ లేదు. కానీ ప్రతీ ఇంట్లో ఉండే సన్నీవేశాలు చిత్రాన్ని చూసేలా చేస్తాయి. డబ్బుకోసం ఏదైనా చేసే భర్త.. అతడిని నానా హింసలు పెట్టే భార్య.. ఈ పాత్రలు మనకు రోజూ ఎదురవుతుంటాయి. ఇక 2 కంట్రీస్ చిత్రానికి వస్తే.. కథ చాలా పాతదే. అయినా దర్శకుడు రొటీన్ కథకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అంశాలను జోడించి మెప్పించాడు. ఫస్టాఫ్‌లో చాలావరకు సునీల్ చేసే కామెడీతో ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత పెళ్లి చుట్టూ కొంత ఎపిసోడ్‌ని, హీరో-హీరోయిన్ల రొమాంటిక్ ఎపిసోడ్‌తో సినిమాని సరదాగా నడిపించాడు దర్శకుడు. భార్యభర్తల మధ్య జరిగే గొడవల్ని చాలా ఫన్నీగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ఇంటర్వెల్ వద్ద వచ్చే ట్విస్ట్ బాగుంది.

ఇక సెకండాఫ్ మొత్తం విడాకుల నేపథ్యం చుట్టే సినిమా సాగుతుంది. ఆ ఇద్దరినీ కలిపేందుకు కుటుంబసభ్యులు చేసే ప్రయత్నాల్ని కూడా శంకర్ చాలా బాగా చూపించాడు. నవ్విస్తూనే మనసుకి హత్తుకునే సన్నివేశాలతో సినిమాను తెరకెక్కించాడు. క్లైమాక్స్‌ కూడా కాస్త డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేశాడు. ఈ సినిమాలో పెద్దగా ట్విస్టులు ఏం లేవు. ఫ్లాట్‌గా సాగే నరేషన్ ప్రేక్షకుల్ని కాస్త ఇబ్బంది పెడుతుంది. మధ్యమధ్యలో కొన్ని సీన్లు కూడా బోర్ కొట్టించేస్తాయి. మొత్తానికి రీమేక్ చిత్రం కావడంతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అంతంత మాత్రంగా నచ్చేస్తుంది.

నటీనటుల ప్రతిభ :
సునీల్ ఎప్పటిలాగే తనదైన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. కామెడీతో కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేశాడు సునీల్. ఇక ఎమోషనల్ సీన్స్‌లో మనోడు చాలా బాయా యాక్ట్ చేయడంతో ప్రేక్షకులు ఆ సీన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. హీరోయిన్ మనీషా రాజ్‌కు ఇది తొలి సినిమా కావడంతో ఆమె నటనాపరంగా చాలా నేర్చుకోవాలి. మిగతా నటీనటులు వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్ :
దర్శకుడు ఎన్.శంకర్ ఎంచుకున్న కధ రొటీన్ అయినప్పటికీ అతడు చూపించిన విధానం బాగుంది. ఒక రొటీన్ కథకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను యాడ్ చేస్తే ఇలాంటి ఫలితాన్ని రాబట్టడం ఖాయం అని అతడు మరోసారి నిరూపించాడు. నటీనటుల దగ్గర్నుండి ఎంత రాబట్టాలో అంతా రాబట్టాడు శంకర్. సి. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. గోపీ సుందర్ అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ ఫర్వాలేదు. ఎన్.శంకర్ నిర్మాణ విలువలు అదిరిపోయాయి.

చివరిగా : 2 కంట్రీస్ – కాస్త బోరింగ్.. కాస్త ఇంట్రెస్టింగ్!

నేటిసినిమా.కామ్ రేటింగ్ : 2.75/5

Related posts:
బాహుబ‌లి వ‌ర‌ల్డ్ బ్లాక్ బ‌స్ట‌ర్‌...అక్క‌డ బిలో యావ‌రేజ్‌
మ‌హేష్ మెచ్చిన హీరోయిన్‌
రెమ్యునరేషన్ విషయమై షాకింగ్ కామెంట్స్ చేసిన ఎస్ఎస్ థమన్
కేరళలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తెలుగు సినిమాల్లో ‘గ్యారేజ్’ ప్లేస్ ఇది!
జై లవ కుశ 4 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. విధ్వంసం అంటే ఇది!
70 పెడితే.. 11 వచ్చింది.. ఇదీ ‘జీఎస్టీ’ లెక్క!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.