నితిన్ ఆశలపై నీళ్ళు చల్లిన సూర్య

24 Movie Dubbing Rights Skips From Nithin
Tellmeboss.net

24 Movie Dubbing Rights Skips From Nithin

హీరో నితిన్‌ డైరెక్టర్ విక్ర‌మ్ కె కుమార్‌ల‌ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ఇష్క్.. ఈ సినిమా నితిన్ కెరీర్‌కి బాగా హెల్ప‌య్యింది. వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న నితిన్‌కి ఆ సినిమా మళ్ళీ స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. ఇక అక్కడ మొదలైన వారి రిలేషన్ ఇప్పటికీ బాగానే నడుస్తుంది.. ఇదే నేపథ్యంలో తమిళ హీరో సూర్య న‌టించిన 24 సినిమా రైట్స్‌ని తెలుగులో చేజిక్కించుకోవాల‌నుకున్నాడు నితిన్‌. దానికి దర్శకత్వం వహిస్తున్న విక్ర‌మ్‌ కూడా అందుకు ఓకే అన్నాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా విడుద‌ల అవుతున్నట్లు కన్ఫర్మ్ చేశారు.. అయితే తాజా సమాచారం ప్రకారం నితిన్ ఆశలకు గండి కొట్టాడు సూర్య.

Tellmeboss.net

తాజాగా ఈ సినిమా శ్రేయాస్ మీడియా తెలుగు హ‌క్కుల్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ వ్య‌వ‌హారం కూడా సూర్య‌ ద‌గ్గ‌రుండి చూసుకొంటున్నాడు. నితిన్ ప్రొడక్షన్ హౌస్ శ్రేష్ట్ మీడియాకు డ‌బ్ రైట్స్ ఇస్తే.. అనుకొన్నంత గిట్టుబాటు అవ్వ‌డం లేద‌ని సూర్య భావించాడ‌ట‌. అందుకే.. అర్జెంటుగా ఈ సినిమాకి మ‌రొక‌రికి క‌ట్ట‌బెట్టాడు. 24 సినిమాపై ఆశ‌లు పెట్టుకొన్న నితిన్ ఒక్క‌సారిగా నీరుగారిపోయాడు. కోట్లతో ముడిపడిన వ్యవహారం కావడంతో విక్రమ్ కూడా నితిన్‌కు సహాయం చేయలేకపోతున్నాడు.

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.