‘అభిమన్యుడు’ 18 డేస్ కలెక్షన్స్.. విశాల్ విశ్వరూపం

కంటెంట్ నచ్చితే చాలు.. హీరో, భాషలతో సంబంధం లేకుండా మన తెలుగు ఆడియెన్స్ ఖచ్చితంగా ఆ చిత్రాన్ని నెత్తికెక్కించుకుంటారు. లేటెస్ట్‌గా ‘అభిమన్యుడు’ మూవీ విషయంలో అదే రిజల్ట్ నమోదైంది. ప్రస్తుతం జనాలందర్ని పట్టిపీడిస్తున్న సైబర్ క్రైమ్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందడం.. జనాలకి అర్థమయ్యేలా చాలా పర్ఫెక్ట్‌గా దర్శకుడు దీన్ని చిత్రీకరించడంతో.. ప్రేక్షకులు దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే.. ఇది అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతోంది.

ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం.. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని 18 రోజుల్లో రూ.8 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ కొల్లగొట్టింది. ఇది విశాల్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఫిగర్! అంతేకాదు.. కమర్షియల్‌గానూ ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచినట్లే! ప్రింట్స్, పబ్లిసిటీతో కలుపుకుని ఈ మూవీ తెలుగు హక్కులకు రూ.4.50 కోట్లు ఖర్చవ్వగా.. దానికి రెట్టింపు వసూళ్ళతో భారీ లాభాలు తెచ్చిపెట్టి ఘనవిజయం సాధించింది. ఇంకా ఈ మూవీ తన దూకుడు కొనసాగిస్తూనే ఉంది కాబట్టి.. టోటల్ రన్‌లోపు రూ.10 కోట్ల మార్క్‌ని అందుకునే ఛాన్స్ ఉందని అంచనా!

ఇక ఏరియాలవారీగా 18 రోజుల కలెక్షన్స్ : (కోట్లలో)
నైజాం : 2.95
ఉత్తరాంధ్ర : 1.37
సీడెడ్ : 0.94
వెస్ట్ : 0.42
వెస్ట్ : 0.67
గుంటూరు : 0.62
కృష్ణా : 0.70
నెల్లూరు : 0.33
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ.8 కోట్లు (షేర్)

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.