అభిమన్యుడు 25 రోజుల కలెక్షన్స్

తమిళ యంగ్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ అభిమన్యుడు ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. టెక్నికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది. తమిళంలో మంచి హిట్ సాధించిన ఈ సినిమా తెలుగులోనూ హిట్ కావడంతో విశాల్ అండ్ టీమ్ పండగ చేసుకుంటున్నారు.

అభిమన్యుడు చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లు సాధిస్తూ సందడి చేస్తోంది. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను పీఎస్ మిత్రన్ డైరెక్ట్ చేశాడు. ఈ చిత్రం 25 రోజులు పూర్తి చేసుకోగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 8.53 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. ఇది విశాల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు కావడం విశేషం. ఈ చిత్రం టోటల్ రన్‌లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఇక ఏరియాల వారీగా ఈ చిత్ర 25 రోజుల షేర్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – 25 రోజుల షేర్ కలెక్షన్లు(కోట్లలో)
నైజాం – 3
సీడెడ్ – 1.13
ఉత్తరాంధ్ర – 1.43
గుంటూరు – 0.7
కృష్ణా – 0.77
ఈస్ట్ – 0.73
వెస్ట్ – 0.45
నెల్లూరు – 0.32
టోటల్ ఏపీ+తెలంగాణ – 8.53 కోట్లు

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.