విశాల్, సమంతల ‘అభిమన్యుడు’ మూవీ రివ్యూ-రేటింగ్

చిత్రం : అభిమన్యుడు
నటీనటులు : విశాల్‌, సమంత, అర్జున్‌, తదితరులు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌
నిర్మాత : విశాల్‌
సంగీతం : యువన్‌ శంకర్‌ రాజా
సినిమాటోగ్రఫీ : జార్స్‌ సి.విలియమ్స్‌
ఎడిటింగ్‌ : రుబెన్‌
బ్యానర్‌: విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ
విడుదల తేదీ: 01-06-2018

‘పందెం కోడి’ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు తమిళ హీరో విశాల్! పైగా.. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాల్నే ఎక్కువగా ఎంచుకుంటాడు కాబట్టి రానురాను అతనికి ఇక్కడ మంచి ఫాలోయింగ్ పెరిగింది. అందుకే.. అతని ప్రతి సినిమానీ తెలుగులోనూ రిలీజ్ చేస్తారు. ఇటవలే ‘డిటెక్టివ్‌’లాంటి కొత్త కథతో ఆకట్టుకున్న విశాల్.. లేటెస్ట్‌గా సైబర్‌ మోసాల నేపథ్యంతో రూపొందిన ‘అభిమన్యుడు’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆల్రెడీ ఇది తమిళంలో రిలీజై, ఘనవిజయం సాధించింది. మరి.. తెలుగు ఆడియెన్స్‌ని కూడా ఈ మూవీ మెప్పించిందా? లేదా? రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ :
కరుణాకర్‌ (విశాల్) ఒక మిలటరీ ఆఫీసర్. ఇతనికి కోపం చాలా ఎక్కువ! ఆ కోపం వల్లే కరుణాకర్ సస్పెండ్ అవుతాడు. కోపాన్ని తగ్గించుకోవడం కోసం యాంగర్‌ మేనేజ్‌మెంట్‌ క్లాస్‌లు తీసుకుంటాడు. ఈ నేపథ్యంలోనే లతాదేవి (సమంత) అనే డాక్టర్‌ను సంప్రదిస్తాడు. కరుణాకర్ కోపానికి అతని గతమే కారణమని తెలుసుకున్న లత.. ఎప్పుడో వదిలేసిన ఇంటికి తిరిగి వెళ్ళమని సలా ఇస్తుంది.

లత సలహా మేరకు కరుణ ఊరికి వెళ్తాడు. అక్కడ అతనిలో కొంచెం కొంచెం మార్పు వస్తుంటుంది. చెల్లెల్ని ప్రేమించిన అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం రూ.10లక్షలు అవసరం అవుతాయి. దీంతో.. ఊరిలో తనకున్న రూ.4 లక్షల ఆస్తిని అమ్మేసి, మరో రూ.6 లక్షలు బ్యాంకులో అప్పు తీసుకుంటాడు. అలా రూ.10 లక్షలు బ్యాంకులో కరుణ జమ చేసిన డబ్బులు సడెన్‌గా మాయమవుతాయి.

ఆ డబ్బులు ఎలా మాయం అవుతాయని విచారిస్తే.. వైట్ డెవిల్ (అర్జున్) ఆ తతంగం వెనుక ఉన్నాడని తెలుస్తుంది. అతను ఎన్నో వేలమంది బ్యాంకు అకౌంట్లను హ్యాక్ చేసి.. ఆ సొమ్మును తన ఖాతాలో మార్చుకుంటాడు. ఇలా సైబర్ క్రైంకి పాల్పడ్డ వైట్ డెవిల్ గురించి తెలుసుకున్న కరుణ.. ఆ తర్వాత ఏం చేశాడు? అతని సామ్రాజ్యాన్ని ఎలా నేల మట్టం చేశాడు? అనే అంశాలతోనే సినిమా సాగుతుంది.

విశ్లేషణ:
ఈరోజుల్లో సైబర్ క్రైం ఎంత విచ్చలవిడిగా జరుగుతోందో అందరికీ తెలుసు! అకౌంట్‌లో ఉన్న డబ్బులను మన ప్రమేయం లేకుండానే ఎవరో దర్జాగా దొంగిలిస్తున్నారు. ఈ సమస్య మీదే దర్శకుడు కథని తయారుచేసుకుని.. ఈ ‘అభిమన్యుడు’ సినిమాని తెరకెక్కించాడు. ఏదో మామూలుగా కాకుండా.. ‘సైబర్ క్రైం’ మూలాల్లోకి వెళ్ళి.. అది ఎలా జరుగుతుందనే ప్రాసెస్‌ని అందరికీ అర్థమయ్యేలా ఈ చిత్రాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దాడు.

కథ మొదట్లో హీరో క్యారెక్టరైజేషన్ కాస్త మామూలుగా నడిచినా.. ఆ తర్వాత సైబర్ క్రైం వ్యవహారంతో ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఒక పక్క సైబర్‌క్రైమ్‌, మరోవైపు కరుణ జీవితాన్ని సమాంతరంగా చూపిస్తూ రెండు కథలను ఒక చోట ముడిపెట్టాడు దర్శకుడు. ఎప్పుడైతే హీరో ఈ సమస్య బారిన పడతాడో.. అప్పట్నుంచి స్టోరీ ఆసక్తికరంగా మారుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్‌ నుంచి కథ మరింత వేగంగా నడుస్తుంది. ద్వితీయార్థం మొత్తం హీరో-విలన్ల పోరాటంతోనే సాగుతుంది.

విలన్ హీరోల మధ్య ఎత్తులు పైఎత్తులు ఆకట్టుకుంటాయి. ఈ నేపథ్యంలోనే డిజిటల్‌ మోసాలు ఎలా జరుగుతున్నాయి? సైబర్‌ క్రైమ్‌ ఎక్కడ మొదలైంది. అనే చాలా విషయాల గురించి దర్శకుడు విశదీకరించి చెప్పాడు. విలన్ పాత్ర బలంగా రాసుకోవడంతో.. ఔట్‌పుట్ అదిరింది. ఓవరాల్‌గా.. ప్రెజెంట్ జనాల్ని వణికిస్తున్న సమస్యపై ఉత్కంఠ రేకెత్తించేలా ‘అభిమన్యుడు’ తెరపై చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

నటీనటుల ప్రతిభ :
విశాల్ ఈసారి ‘హీరోయిజం’ జోలికి పోకుండా తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక వైట్ డెవిల్ పాత్రలో అర్జున్ నటనాప్రతిభ అమోఘం. స్టైలిష్ యాక్టింగ్‌తో తన పాత్రనే కాదు.. కథను కూడా వేరే స్థాయిలోకి తీసుకెళ్లాడు. విశాల్‌-అర్జున్‌ల మధ్య సాగే సన్నివేశాలు, వాళ్లు వేసుకునే ఎత్తుకు పైఎత్తులే ఈ సినిమాను నిలబెట్టాయి. సమంతది కూడా ప్రాధాన్యం ఉన్న పాత్రే! ఇక మిగిలిన వాళ్ళు తమిళ నటీనటులే.

టెక్నికల్ పెర్ఫార్మెన్స్ :
జార్జ్‌ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రుబెన్‌ ఎడిటింగ్‌ చాలా షార్ప్‌గా ఉంది. యువన్‌ పాటలు ఫర్వాలేదు. నేపథ్య సంగీతం అయితే అదిరింది. చాలా సన్నివేశాల్ని బాగా ఎలివేట్ చేశాడు. నిర్మాణ విలువలకు ఎక్కడా వంక పెట్టడానికి లేదు. ఇక దర్శకుడు ఎంచుకున్న స్టోరీలైన్, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానాన్ని మెచ్చుకోలేక ఉండలేం. ముఖ్యంగా.. సెకండాఫ్‌లో అతను స్ర్కీన్‌ప్లే అల్లిన విధానం మేజర్ హైలైట్.

చివరగా : సైబర్ నేరగాళ్ళపై అభిమన్యుడి పంజా
రేటింగ్ : 3.25/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.