మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్‌ల ‘ఆచారి అమెరికా యాత్ర’ రివ్యూ-రేటింగ్

సినిమా : ఆచారి అమెరికా యాత్ర
నటీనటులు : మంచు విష్ణు, ప్రగ్యా జైశ్వాల్‌, బ్రహ్మానందం, కోటా శ్రీనివాస రావు, తదితరులు
స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం : నాగేశ్వర రెడ్డి
నిర్మాతలు : కిట్టు, కీర్తి చౌదరి
సంగీతం : ఎస్‌.ఎస్‌ తమన్‌
సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ్
విడుదల తేదీ : 27-04-2018

మంచు విష్ణు చాలాకాలం నుంచి హిట్ కోసం పరితపిస్తున్నాడు. ఎంత ప్రయత్నిస్తున్నా.. ప్రతిఒక్కటి బెడిసికొట్టి అతని ఇమేజ్‌ని మరింత దెబ్బతీశాయి. దీంతో.. తిరిగి పుంజుకోవడం కోసం తనకు అచ్చొచ్చిన జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడితో చేతులు కలిపి ‘ఆచారి అమెరికా యాత్రం’ సినిమా చేశాడు. వీరి కాంబోలో ఇదివరకు వచ్చిన ‘దేనికైరా రెడీ’, ‘ఈడోరకం ఆడోరకం’ చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో.. దీనిపై ఓ మోస్తరు అంచనాలే నెలకొన్నాయి. పైగా.. ‘ఢీ’ నుంచి విష్ణు, బ్రహ్మానందం కాంబినేషన్‌ హిట్టే కావడంతో.. ఈసారి కూడా వారి కాంబో అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారని జనాల్లో ఆసక్తి ఏర్పడింది. మరి.. వాటిని అందుకోవడంలో ఈ మూవీ సక్సెస్ అయ్యిందా? లేదా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ :
కృష్ణమాచారి (మంచు విష్ణు) ఒక పంతులు. ఓసారి తన గురువు అప్పలాచారి (బ్రహ్మానందం)తోపాటు తోటి అర్చక బృందంతో కలిసి ఒక ఒక పెద్దాయన (కోటా శ్రీనివాస్‌రావు) ఇంట్లో హోమం చేయించడానికి కృష్ణమాచారి వెళ్తాడు. అమెరికా నుంచి వచ్చిన ఆ పెద్దాయన మనవరాలు రేణుక (ప్రగ్యా జైశ్వాల్)ను కృష్ణమాచారి చూసి ఇష్టపడతాడు. రేణుక కూడా అతడ్ని కొన్ని పరిణామాల అనంతరం ఇష్టపడుతుంది.

అయితే.. హోమం ముగిసే టైంలో అనుకోకుండా ఓ సంఘటన చోటు చేసుకోవడంతో ఆ ఇంటి పెద్దాయన హఠాత్తుగా చనిపోతాడు. దీంతో భయబ్రాంతులకు గురైన గురుశిష్యులిద్దరూ అమెరికాకు వెళ్లిపోతారు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది? ఇంతకీ రేణుక తాతయ్య ఎందుకు, ఎలా చనిపోయాడు? అసలు గురుశిష్యులిద్దరూ అమెరికాకే ఎందుకు వెళ్ళారు? ఆ ఘటన తర్వాత రేణుక ఎలాంటి ఇబ్బందుల్లో పడింది? ఈ సమస్యలన్నింటినీ కృష్ణమాచారి ఎలా పరిష్కరించాడు? అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ :
తమ సినిమాలో కామెడీయే ప్రధానమని ముందునుంచి యూనిట్ చెప్పుకుంటూ వస్తోంది. ప్రోమోలు కూడా ఆసక్తికరమైనవే రిలీజ్ చేయడంతో.. ఇది పక్కాగా ఎంటర్టైన్ చేస్తుందనే అభిప్రాయం జనాల్లో ఏర్పడింది. పైగా.. విష్ణు, బ్రహ్మానందం కాంబో ఎప్పుడూ హిట్టే కావడం, జి.నాగేశ్వరరెడ్డి కామెడీని పండించడంలో సిద్దహస్తుడు కావడంతో.. ఈ చిత్రం మినిమం గ్యారెంటీ వినోదాన్ని అందిస్తుందన్న భరోసా కలిగింది. తీరా సినిమా చూస్తే.. విరక్తి కలుగుతుందే తప్ప ఎక్కడా మనస్ఫూర్తిగా నవ్వుకునే సరైన సీన్ ఒక్కటీ కూడా లేదు. మొదట్నుంచీ అంతే.. పేవలమైన సీన్లతో దర్శకుడు విసుగెత్తించాడే తప్ప ఎక్కడా ఎంటర్టైన్ చేయలేకపోయాడు. కొన్నికొన్ని చోట్ల తన మార్క్ కామెడీతో కాస్త నవ్వులూ పూయించాడంతే!

ఫస్టాఫ్ విషయానికొస్తే.. మొదట్లో కాస్త నెమ్మదిగా మొదలైనా ఆ తర్వాత కొంచెం వేగం పుంజుకుంటుంది. ముఖ్యంగా.. పెద్దాయన ఇంట్లో హోమం మొదలైన దగ్గరనుంచి ముగిసేవరకు ఒకింత ఎంగేజ్ చేయగలిగింది. అక్కడ పండిన కామెడీ, హీరో-హీరోయిన్ల లవ్ ట్రాక్ అంతా ఫర్వాలేదు. ఇక ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ కూడా బాగుంది. కానీ.. ద్వితీయార్థం అనుకున్నంత స్థాయిలో లేకపోవడం, పూర్తిగా బోర్ కొట్టించేయడంతో ఇదొక దిక్కుమాలిన ‘యాత్ర’గా మిగిలిపోయింది. మొత్తం అమెరికా నేపథ్యంలోనే నడిచే సెకండాఫ్‌లో సీన్లన్నీ పేలవంగానే వున్నాయి. అక్కడికి ప్రతినాయకులు రావడం, హీరో తెలివిగా రేణుకని కాపాడటం చుట్టే సినిమా మొత్తం సా….గుతుంది. కామెడీ కూడా పూర్తిగా తగ్గడంతో ప్రేక్షకులు అసహనానికి గురవుతారు. పతాక సన్నివేశాలు కూడా పెద్దగా ఆసక్తికరంగా లేవు.

నటీనటుల ప్రతిభ :
మంచు విష్ణు ఎప్పట్లాగే ఆచారి పాత్రని లాగించేశాడు. కొత్తదనం లేకపోయినా.. తనకు అలవాటైన తరహాలోనే నటించాడు. హాస్య బ్రహ్మానందం కూడా రొటీన్ స్టైల్‌తోనే కానిచ్చేశాడు. హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ నటన గురించి మట్లాడాల్సిన అవసరం లేదు. గ్లామరసం పండించిందంతే! విలన్ పాత్రల్లో కనిపించిన అనూప్ సింగ్ ఠాకూర్.. ప్రదీప్ రావత్ ఏమంత ఆకట్టుకోలేకపోయారు. మిగతా కమెడియన్లు నవ్వించడానికి బాగా ప్రయత్నించారు కానీ.. వర్కౌట్ అవ్వలేదు. మిగతా వాళ్ళు మామూలే!

సాంకేతిక ప్రతిభ :
సిద్దార్థ్ ఛాయాగ్రహణం పర్వాలేదు. తమన్ పాటలు, నేపథ్య సంగీతం మామూలే! నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్‌కి పని చెప్పాల్సింది. దర్శకుడు నాగేశ్వరరెడ్డి ఎంచుకున్న కథ చాలా పాతదే! స్క్రీన్ ప్లేలోనూ ఏ విశేషం లేకపోయింది. కామెడీని బాగా డీల్ చేయగలిగే సత్తా వున్న దర్శకుడిగా పేరొందిన ఈయన.. ఈసారి ఏ రకంగానూ మెప్పించలేకపోయాడు.

చివరగా : ఈ యాత్రని భరించడం చాలా కష్టం
రేటింగ్ : 2.25/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.