అదాశర్మను వేధించిన ఫ్యాన్స్.. పీడకలలా తయారైన ట్రిప్!

Adah Sharma Mobbed Vijayawada

Adah Sharma Mobbed Vijayawada PVP Shopping Mall

ఏదైనా ఓ ఈవెంట్‌కి ఓ హీరోయిన్ హాజరవుతోందని సమాచారం అందితే చాలు.. వేలకొద్ది జనాలు ఆ ప్రాంతానికి చేరుకుంటారు. తమ అభిమాన నటిని చూసేందుకు ఉత్సాహపడుతుంటారు. కానీ.. అదే ఉత్సాహంలో వారు చేయరాని పనులు చేసి హీరోయిన్లను తెగ ఇబ్బంది పెడుతుంటారు. మరికొందరు ఆకతాయిలైతే వారిని టచ్ చేస్తూ.. ఎక్కడబడితే అక్కడ తాకడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు ఇలాంటి చెత్త ఫ్యాన్స్ బారినపడగా.. తాజాగా అదాశర్మకు అలాంటి చేదు అనుభవమే మిగిలింది. తాను నటించిన ‘క్షణం’ సినిమా ఘనవిజయం సాధించడంతో.. ఆ మూవీ సక్సెస్‌ను ప్రేక్షకులతో పంచుకునేందుకు విజయవాడకు వెళ్ళగా.. అక్కడ ఆమెను ఫ్యాన్స్ వేధించి.. ఆ ట్రిప్‌ని పీడకలలా మిగిల్చారు.

గత శుక్రవారం విడుదలైన ‘క్షణం’ థ్రిల్లర్ సినిమా అనూహ్య విజయం సాధించింది. దీంతో.. ఈ మూవీ సక్సెస్‌ని ప్రేక్షకులతో పంచుకునేందుకు చిత్రబృందం సక్సెస్ టూర్లను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే అదాశర్మ విజయవాడకు వెళ్లింది. ‘విజయవాడలోని పీవీపీ మాల్‌లో మిమ్మల్ని (ప్రేక్షకులను) కలుసుకునేందుకు వస్తున్నాను’ అంటూ తన ట్విటర్ ఖాతా ద్వారా అమ్మడు ముందుగానే చెప్పింది. దీంతో.. ఈ అమ్మడు రాకముందే అక్కడికి ఫ్యాన్స్ భారీగానే చేరుకున్నారు. ఇక అదాశర్మ అక్కడికి చేరుకోగానే అభిమానులందరూ ఓ పాట కూడా వేసుకున్నారు. దీంతో అక్కడ సరదా వాతావరణం నెలకొంది. ఇంతవరకు బాగానే వుంది కానీ.. మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాత అదాశర్మకి ప్రేక్షకుల నుంచి ఊహించని షాక్ తగిలింది.

అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయేందుకు అదా సిద్ధమవుతున్న సమయంలో.. అక్కడున్న ప్రేక్షకులందరూ ఆమె ఆదా దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో.. అక్కడి పరిస్థితి గందరగోళంగా మారింది. అక్కడ భారీగానే సెక్యూరిటీ స్టాఫ్ వున్నప్పటికీ.. ఆ జనాన్ని అదుపు చేయలేకపోయారు. 2వేలకు పైగా జనాలు ఒక్కసారిగా తోసుకురావడంతో తొక్కిసలాట కంట్రోల్ చేయడం సాధ్యపడలేదు. ఆ దెబ్బతో అదాశర్మ బాగానే ఇబ్బందిపడింది. ఆ జనాల గుంపు నుంచి బయటపడేందుకు అమ్మడు చాలా కష్టపడాల్సి వచ్చింది. అదే సమయంలో కొందరు ఆకతాయిలు ఆమెను టచ్ చేయాలని అలాగే చేతులు పట్టుకోవడం లాంటి వెకిలి చేష్టలు చేశారట. ఎలాగోలా బయటపడ్డ అదాశర్మ.. వెంటనే హైదరాబాద్‌కు చేరుకుంది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.