‘అజ్ఞాతవాసి’.. చివరి నిమిషంలో పెద్ద బాంబ్!

Tellmeboss.net

‘అజ్ఞాతవాసి’ సినిమా సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచి ఫ్యాన్స్‌ని డిజప్పాయింట్ చేస్తూ వస్తోంది. దాదాపు పదినెలలపాటు టైటిల్ విషయంలో క్లారిటీ ఇవ్వకుండా అభిమానులకి నరాలు తెగిపోయేలా టెన్షన్ పెట్టించేసింది. ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిష్టర్ టైటిలే ఫైనల్ చేస్తారా? లేక మరొకటి ఫిక్స్ చేస్తారా? అంటూ ఆందోళనలో పడేసి ఓ ఆటాడుకున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్ వ్యవహారంలోనూ యూనిట్ అదే పని చేసింది. ఇదిగో, అదిగో అంటూ వాయిదాలు వేస్తూ తెగ విసిగించేసింది. ఎంతైనా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కదా.. ఆలస్యం అయిన ప్రతిసారీ ఆగ్రహం వెళ్లగక్కకుండా ప్రశాంతత పాటించారు. దీన్ని యూనిట్ మరింత అలుసుగా తీసుకుందేమో.. ఇప్పుడు చివరి నిముషంలో మరో పెద్ద బాంబ్ పేల్చింది.

Tellmeboss.net

సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వడంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు చివరి స్టేజ్‌కి చేరుకోవడంతో.. ఆడియో ఈవెంట్‌ని ఈనెల 14న లేదా 15న నిర్వహించాలని యూనిట్ భావించింది. కానీ.. తెలుగు మహాసభలు కారణంగా పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో.. డిసెంబర్ 19న ఆడియో ఫంక్షన్ జరపాలని అనుకుంది. దాదాపు అదే తేదీకి ఫిక్స్ అయినట్లు సంకేతాలూ వచ్చాయి. కానీ.. ఇప్పుడు మళ్ళీ వాయిదా వేసినట్లు సమాచారం. ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఈ చిత్రం ఆడియో ఈవెంట్‌ని ఈనెల 21న గ్రాండ్‌గా నిర్వహించేలా యూనిట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కాకపోతే.. వెన్యూ ఇంకా డిసైడ్ చేయలేదు. త్వరలోనే అది కూడా ఫిక్స్ చేసుకుని.. అధికారికంగా డేట్‌ని వెల్లడించాలని చిత్ర టీం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈసారి ఆడియో ఈవెంట్ డేట్ మార్చినా.. కేవలం రెండు రోజుల గ్యాప్ మాత్రమే కావడంతో ఫ్యాన్స్ పెద్దగా డిజప్పాయింట్‌మెంట్ వ్యక్తపరచడం లేదు. ఇకపోతే.. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పవన్ సరసన అను ఎమ్మాన్యుయెల్, కీర్తిసురేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10వ తేదీని రిలీజ్ కాబోతోంది.

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.