గాలికి తిరుగుతున్న అజ్ఞాతవాసి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు జనాలు. ఇక ఈ సినిమాతో పవన్-త్రివిక్రమ్ కాంబో ముచ్చటగా మూడోసారి మనముందుకు వస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్, సింగిల్ ట్రాక్ ఇండస్ట్రీలో నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.

ఇక తాజాగా మరో సింగిల్ ట్రాక్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలో ‘గాలి వాలుగా’ అంటూ సాగే పాటను రిలీజ్ చేయనున్నారు అజ్ఞాతవాసి టీమ్. ఈ పాటను ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఈ రోజు వారు ప్రకటించనున్నారు. ఈ పాట కూడా ఫస్ట్ సింగిల్ లాగే చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమా పాటలు టాలీవుడ్‌‌లో కొత్త ట్రెండ్‌ను సెట్ చేయడం ఖాయం అని అంటున్నారు చిత్ర యూనిట్. యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం చాలా క్యాచీగా చాలా కొత్తగా ఉండటంతో ప్రేక్షకులు ఈ చిత్ర పాటలకు ఫిదా అవ్వడం ఖాయం అంటున్నారు వారు.

పవన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయెల్, కీర్తి సురేష్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.