త్రివిక్రమ్ దెబ్బకు ‘అజ్ఞాతం’లో ఎన్టీఆర్..?

agnyaathavaasi, ntr trivikram film, pawan kalyan, trivikram srinivas, #NTR28, junior ntr
Tellmeboss.net

‘అజ్ఞాతవాసి’ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొనడం వెనుక.. పవన్ కళ్యాణ్‌కి ఉన్న డేంజరస్ ఫాలోయింగ్ కంటే త్రివిక్రమ్ క్రేజే ఎక్కువగా తోడయ్యింది. ఇతర దర్శకులతో పోలిస్తే ఆయన మార్క్ స్టైల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. బలమైన డైలాగులు, కడుపుబ్బా నవ్వించే ఎంటర్టైన్‌మెంట్, మైండ్‌బ్లోయింగ్ పంచ్‌లు, ఆసక్తికరమైన డ్రామా.. ఇవన్నీ ప్రత్యేకతలు కలిగి ఉండడంతో ఆయనపై జనాలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు.

Tellmeboss.net

తీరా చూస్తే.. త్రివిక్రమ్ ఈసారి ఆ అంచనాల్ని బోల్తాకొట్టించేస్తూ తీవ్రంగా నిరాశపరిచాడు. అసలు ఈ మూవీ తీసింది త్రివిక్రమేనా అనుకునేంత దారుణంగా ఉండడంతో ఆ దర్శకుడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఇదే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే.. తారక్ తన తదుపరి చేయబోయేది త్రివిక్రమ్ దర్శకత్వంలోనే కాబట్టి! పవర్‌స్టార్ లాంటి హీరోని పెట్టుకునే త్రివిక్రమ్ ఏమాత్రం మ్యాజిక్ చేయలేకపోవడంతో.. ఇక తమ హీరోతో ఆయన ఎలాంటి మూవీ తెరకెక్కిస్తాడోనని బెంబేలెత్తిపోతున్నారు. పైగా.. ‘అజ్ఞాతవాసి’పై కాపీ వివాదం కూడా చెలరేగింది. తమ హీరో మూవీని కూడా ఎక్కడినుంచైనా లేపేస్తాడోమోనన్న భయాందోళన కూడా తారక్ ఫ్యాన్స్‌లో మొదలైంది.

నిజానికి.. త్రివిక్రమ్ క్రియేటివిటీకి వంక పెట్టడానికి లేదు కానీ, ‘అజ్ఞాతవాసి’లో ఎక్కడా ఆయన మార్క్ కనిపించకపోవడమే ఆయన యాటిట్యూడ్‌పై అనుమానాలు వచ్చేలా చేస్తోంది. మరి.. తారక్ చిత్రాన్ని ఆయన ఎలా హ్యాండిల్ చేస్తాడో వేచి చూడాలి.

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.