అజ్ఞాతవాసి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎస్టిమేషన్

ప్రస్తుతం టాలీవుడ్ అంతటా ‘అజ్ఞాతవాసి’ ఫీవర్ కమ్ముకుపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుండటంతో ఈ సినిమాను ఫస్ట్ డే చూసేందుకు పవన్ ఫ్యాన్స్ నుండి సెలెబ్రిటీల వరకు పోటీపడుతున్నారు. అయితే ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు చిత్ర వర్గాలు. ముఖ్యంగా ఈ చిత్ర కలెక్షన్స్‌పైనే అందరి చూపు ఉంది.

ఇప్పటికే పిచ్చెక్కించే విధంగా ఈ చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఇక టిక్కెట్లు కూడా అదిరిపోయే రేంజ్‌లో అమ్ముడవుతున్నాయి. పది రోజులపాటు టికెట్ ధరలు పెంచుకోవడనానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం, అదనపు షోలు పడుతుండటంతో ఈ సినిమా ఎంతవరకు కలెక్షన్స్‌ను రాబడుతుందా అని ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు జనాలు. అయితే అజ్ఞాతవాసి ట్రైలర్ ఇచ్చిన కాన్ఫిడెన్స్, పవన్ క్రేజ్, త్రివిక్రమ్ రైటింగ్‌లు కలిసి ఈ సినిమాకు దిమ్మతిరిగే కలెక్షన్స్‌ను తెచ్చిపెట్టడం ఖాయం అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఈ చిత్రం మొదటి రోజే ఏకంగా రూ. 40 కోట్ల షేర్ సాధించవచ్చిన ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఓవర్సీస్‌లో పవన్ క్రేజ్‌ దృష్ట్యా ఈ సినిమా ఒకటి లేదా రెండు రోజుల్లో డబుల్ మిలియన్ మార్క్ దాటేస్తుందని వారు అంటున్నారు. అటు కర్ణాటకలోనూ ఈ చిత్ర టిక్కెట్ల అమ్మకం ఫుల్ స్పీడుగా ఉండటంతో ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

ఇక ఈ చిత్రానికి బ్లాక్‌బస్టర్ టాక్ వస్తే మాత్రం రూ.150 కోట్ల మార్కు అందుకోవడం పెద్ద విషయమే కాదంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్. కానీ ఈ చిత్రం బిలో యావరేజ్ టాక్ తెచ్చుకుంటేనే కలెక్షన్స్‌ స్పీడుకు బ్రేకులు పడే అవకాశం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు. మరి అజ్ఞాతవాసి సత్తా ఏమిటనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.