అజ్ఞాతవాసి ఫస్ట్ డే వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. రికార్డులను అజ్ఞాతంలోకి నెట్టిన పవన్!

Tellmeboss.net

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ భారీ అంచనాల నడుమ నిన్న(జనవరి 10) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూశారు చిత్ర ప్రేక్షకులు. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలవుతాయని ముందునుండే ఫిక్స్ అయ్యారు. ఇక సినిమా రిలీజ్ రోజున వారి సందడి మామూలుగా లేదు. ప్రతి థియేటర్ వద్ద పవన్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. మొదటి ఆట ముగిసే సమయానికి అజ్ఞాతవాసి చిత్రం మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో సినిమా కలెక్షన్స్‌పై ఆ ప్రభావం ఏమాత్రం పడలేదు.

Tellmeboss.net

అజ్ఞాతవాసి చిత్రం చూసేందుకు ఆడియెన్స్ ముందు నుండే టిక్కెట్లు బుక్ చేసుకోవడంతో ఫస్ట్ డే అన్ని షోలూ హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చాయి. ఇక ఆంధ్రా, తెలంగాణలో ఈ సినిమాకు అదనపు షోల బెనిఫిట్ కూడా బాగా కలిసొచ్చింది. దీంతో ఈ చిత్రం కలెక్షన్స్ ఎవ్వరి ఊహకు అందకుండా ఉంటాయని ట్రేడ్ నిపుణులు లెక్కలు వేశారు. ఇక మొదటి రోజు ఏకంగా రూ. 39 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ కొల్లగొట్టి టాలీవుడ్‌లో పవన్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. కేవలం బాహుబలి-2ను మినహాయిస్తే అజ్ఞాతవాసి ఓపెనింగ్ రోజున ఉన్న అన్ని రికార్డులను దాదాపు తొక్కేసింది. ఏరీయాలవారీగా ఈ చిత్ర ఫస్డ్ డే కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి..

ఏరియా – ఫస్ట్ డే కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 5.45 కోట్లు
సీడెడ్ – 3.35 కోట్లు
గుంటూరు – 3.78 కోట్లు
వైజాగ్ – 3.75 కోట్లు
తూర్పు గోదావరి – 2.86 కోట్లు
పశ్చిమ గోదావరి – 3.70 కోట్లు
నెల్లూరు – 1.64 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 26.36 కోట్లు(నాన్-బాహుబలి రికార్డు)
ఓవర్సీస్ – 5.94 కోట్లు
కర్ణాటక – 5.14 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.76 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 39.2 కోట్లు

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.