అజ్ఞాతవాసి పీకపై కోటేశ్వరరావు కత్తి

పెద్ద సినిమాల బొమ్మలు థియేటర్లలో పడేంతవరకు అవి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటాయి. అప్పటికప్పుడు లైమ్‌లైట్‌లోకి రావాలనే ఉద్దేశంతో ఏదో ఒక వంక చూపించి కొందరు కేసులు పెడుతుంటారు. ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’ సినిమాకి కూడా అలాంటి చిక్కెదురైంది.

‘కొడకా కోటేశ్వరరావా’ అనే పాట ఆ పేరు మీదున్నవాళ్ల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని కోటేశ్వర్ రావు అనే లాయర్ మాచవరం పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఫైల్ చేయించాడు. ఇప్పుడెక్కడ చూసినా ఈ హడావిడే నడుస్తోంది. నిజానికి.. ఈ పాట విడుదలై దాదాపు పదిరోజులవుతోంది. అప్పటి నుంచి కాకుండా సరిగ్గా రిలీజ్ టైంలో ఈ కేసు ఫైల్ చేయడం గమనార్హం. దీని గురించిన పూర్తి వివరాలు ఇంకా బయటికి రాలేదు కాని సదరు పోలీస్ స్టేషన్ దగ్గర భారీ డ్రామా నెలకొంది.

ఇప్పటికే ప్రీమియర్ షోలు రద్దు చేశారని తీవ్ర అసంతృప్తిలో ఫ్యాన్స్ ఉంటే.. ఇప్పుడు కొడకా కోటేశ్వర్ రావా పాట గొడవ తోడవ్వడంతో అభిమానులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. శుభమా అని రిలీజ్ అవుతున్న టైంలో ఈ గొడవలేందిరా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు.

Related posts:
బయటకు పార్టీ కార్యాలయం.. లోపల చీకటి వ్యవహారం
హీరోయిన్ శ్వేతా మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. పోలీస్ స్టేషన్‌లోనే తల్లీకూతుళ్ళ ఫైట్
శివరాత్రినాడు ఉపవాసం ఎందుకు ఉంటారు అని ప్రశ్నించిన రేణు దేశాయ్
ఆ నలుగురితో సహజీవనం చేశానంటున్న ముమైత్‌ఖాన్
కత్తికి కాలింది.. ఇంకో మండే ట్వీట్
‘పిట్ట’తోనూ కూత కూయించని బన్నీ.. పవన్ ఫ్యాన్స్ ఫైర్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.