రాజు ‘నైజాం’ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ‘అజ్ఞాతవాసి’

నిన్నటివరకు బయ్యర్లకు తమ వరాలు తీర్చే దేవుడిలా దర్శనమిచ్చిన ‘అజ్ఞాతవాసి’ ఇప్పుడు వారిపాలిట డబ్బుల్ని మింగేసే బకారుసుడిలా మారాడు. ఏదో లాభాలు తెచ్చిపెడతాడని కోట్లు కుమ్మరించి మరీ హక్కులు తీసుకుంటే.. ఇప్పుడా పెట్టుబడి తిరిగి వస్తుందో లేదోనని భయంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కూర్చుకున్నారు. ఒకరో ఇద్దరో కాదు.. ప్రతి డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి ఇలాగే ఉంది. తొలిరోజు ‘క్రేజ్’ అనే సునామీలో భారీస్థాయిలో వసూళ్లు కొల్లగొట్టిన మాట వాస్తవమే కానీ.. ఆ సునామీ తర్వాత మిగిలిపోయే కరువు బ్రతుకుల్లా వారి పరిస్థితి తయారైంది. అందుకు కారణం.. ఈ చిత్రం తీవ్రంగా డిజప్పాయింట్ చేయడమే.

ఏ అంచనాలైతే జనాలు పెట్టుకుని థియేటర్లకి వెళ్లారో.. అది అందుకోవడంలో పూర్తి విఫలం కావడంతో సినిమాపై వ్యతిరేకత ఎక్కువైపోయింది. ఆఖరికి స్వయంగా పవన్ కళ్యాణ్ అభిమానులే ‘అజ్ఞాతవాసి’పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇలాంటి చెత్త సినిమా ఎందుకు తీశారంటూ పవన్, త్రివిక్రమ్ నిలదీస్తున్నారు. దీని ప్రభావం సాదారణ ప్రేక్షకుల మీద ఎక్కువగా చూపించడంతో ఎవ్వరూ థియేటర్లకి వెళ్లడం లేదు. రెండోరోజుకే ఇలా ఎఫెక్ట్ పడితే.. మున్ముందు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి. దీంతో బయ్యర్లందరూ తాము నిండా మోసపోయామంటూ లబోదిబోమంటున్నారు. వేరే వాళ్ల పరిస్థితి ఏమోగానీ.. అందరికంటే ఎక్కువ నష్టాల్ని చవిచూసేది మాత్రం ఒక్క దిల్‌రాజే!

సినిమాల మీద మంచి పట్టు ఉన్న దిల్‌రాజు.. పవన్, త్రివిక్రమ్ క్రేజీ కాంబో మీదున్న నమ్మకంతో ‘అజ్ఞాతవాసి’ నైజాం హక్కుల్ని ఏకంగా రూ.29 కోట్లకి కొనుగోలు చేశాడు. ఫస్ట్‌టైమ్ దిల్‌రాజు ఇంత సాహసానికి ఒడిగట్టాడు. యావరేజ్ టాక్ వచ్చిన తన పెట్టుబడి వచ్చేస్తుందనుకున్నాడు కానీ.. విపరీతమైన నెగెటివ్ టాక్ అతని కలల్ని పటాపంచలు చేసింది. తొలిరోజు రూ.5+ కోట్లు వచ్చాయి కానీ.. రెండో రోజు కనీసం 50 శాతం కూడా థియేటర్లు ఫుల్ కాలేదు. ఇక ‘జై సింహా’, ‘గ్యాంగ్’ సినిమాలొచ్చాక వాటి ప్రభావం ‘అజ్ఞాతవాసి’పై మరింత పడుతుంది. ఓవరాల్‌గా లెక్కేసుకుంటే.. ఈ చిత్రం రూ.15 కోట్లకంటే ఎక్కువ కలెక్ట్ చేయకపోవచ్చని ట్రేడ్ అంచనా. అదే జరిగితే.. దిల్‌రాజు సగానికి పైగా నష్టం చవిచూడాల్సిందే.

ఆల్రెడీ దిల్‌రాజు ‘స్పైడర్’తో భారీ దెబ్బ తిన్నాడు. ఈసారైనా గట్టిగా కొడదామని పెద్ద సాహసం చేస్తే.. ఇది కూడా బెడిసికొట్టింది. నిర్మాతగా సక్సెస్ సాధిస్తున్న టైంలో డిస్ట్రిబ్యూటర్‌గా దిల్‌రాజు దెబ్బ మీద దెబ్బ తింటున్నాడు. నైజాంలో స్వయంగా తానే తన సామ్రాజ్యాన్ని కూల్చుకుంటున్నాడు.

Related posts:
హీరోయిన్ ఆర్తి అగ‌ర్వాల్ క‌న్నుమూత‌..విక‌టించిన ఆఫ‌రేష‌న్‌
మార్చి 4 న నాగశౌర్య , మాళవిక నాయర్ ల " కళ్యాణ వైభోగమే "
ఊరు పేరు లేని నిఖిల్ సినిమాకు అదిరిపోయే గిరాకీ!!
రజనీకాంత్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. పెద్ద షాకిచ్చిన శంకర్
సెన్సేషనల్ న్యూస్ : రజనీ 5.. అక్షయ్ కుమార్ 12 !!
ట్విస్ట్ అంటే ఇది.. సాయిపల్లవికి రాజ్ తరుణ్ ఛాలెంజ్!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.