‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఓవర్సీస్ సీన్ సితార్.. 50%కి పైగా నష్టాలు

Tellmeboss.net

ఓవర్సీస్ ప్రేక్షకుల అభిరుచి ఏంటో అందరికీ తెలుసు. రొటీన్‌కి భిన్నంగా ఉండే మూవీలకే వాళ్లు తమ నెట్టిన కూర్చోబెట్టుకుంటారు. చిన్నోడా, పెద్దోడా అని తేడా లేకుండా అందరి హీరోల్ని సమానంగా ట్రీట్ చేస్తూ కథకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. తమ అభిరుచికి దగ్గరగా ఉన్న సినిమాని గెలిపిస్తారు.. లేకపోతే మొదటికే తిప్పికొడ్తారు. ‘అజ్ఞాతవాసి’ మూవీ విషయంలోనూ అలాంటి వాతావరణమే కనిపిస్తోంది.

పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో భారీ అంచనాలతో ఓవర్సీస్ ఆడియెన్స్ థియేటర్లపై ఎగబడ్డారు. పవన్ తన పవర్‌తో ఎనర్జీ నింపితే, త్రివిక్రమ్ తన ‘పెన్’ మంత్రంతో మాయ చేస్తాడని ఆశించారు. ఈ ఉద్దేశంతో థియేటర్లకి పరుగులు తీయగా.. కేవలం ప్రీమియర్స్ ద్వారానే ఈ మూవీ రూ.10 కోట్లకుపైగా గ్రాస్ కొల్లగొట్టింది. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ.. వారి ఊహాగానాల్ని బోల్తాకొట్టించేస్తూ ఈ చిత్రం తీవ్ర నిరాశకి గురిచేసింది. మరీ ఇంత ఛెండాలంగా ఉందేంటి అనుకునేలా అసహ్యం కలిగించింది ఈ చిత్రం. దీంతో.. బుధవారానికే జనాల్ని ఈ చిత్రాన్ని తిప్పికొట్టారు.

Tellmeboss.net

థియేటర్లన్నీ బోసిపోయాయని అక్కడి ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు. చాలా లొకేషన్స్‌లో ఇలాంటి పరిస్థితే నెలకొందని అంటున్నారు. రానురాను మరింత దారుణమైన పరిస్థితి నెలకొంటుందని, ఈ లెక్కన డిస్ట్రిబ్యూటర్స్‌కి భారీ నష్టాలు మిగలడం ఖాయమంటున్నారు. ఈ మూవీ ఓవర్సీస్ హక్కుల్ని అక్కడి బయ్యర్స్ రూ.20 కోట్లకి కొనుగోలు చేశారు. ప్రీమియర్స్ ద్వారానే ఈ మూవీ రూ.10 కోట్ల గ్రాస్ చేసింది. అందులో ట్యాక్స్‌తోపాటు మిగిలిన ఖర్చలన్నీ పోను రూ.5 కోట్ల షేర్ మిగులుతుంది.

తొలిరోజుకే అంత మొత్తం రావడం నిజంగా గొప్ప విషయమే కానీ.. రెండోరోజు నుంచి వసూళ్లు దారుణంగా డ్రాప్ అవుతాయని ట్రేడ్ వర్గాలంటున్నాయి. ఓవరాల్‌గా రూ.10 కోట్ల షేర్ రావడమే పెద్ద కష్టమంటున్నారు. అక్కడి ఆడియెన్స్‌ని ఏ రకంగానూ మెప్పించలేదు కాబట్టి.. పెట్టుబడిలో సగం కూడా రాకపోవచ్చని, బయ్యర్స్‌కి 50 శాతానికి పైగా నష్టాలు మిగలడం ఖాయమని వారి అంచనా. మరి.. రిజల్ట్ ఎలా వస్తుందో చూడాలి.

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.