అజ్ఞాతవాసికి సైకిల్ ‘కార్’చిచ్చు

agnyaathavaasi premiers not allowed in telangana
Tellmeboss.net

పెద్ద సినిమాలొస్తున్నాయంటే ప్రీమియర్ షోస్ వేయడం సహజం. కానీ.. ఈమధ్య ప్రభుత్వాలు వీటికి ఆంక్షలు విధిస్తున్నాయి. అభిమానం పేరుతో ఫ్యాన్స్ లేనిపోని రచ్చ చేయొచ్చని.. తొక్కిసలాటలు జరిగే ప్రమాదం ఉంటుందని పర్మిషన్స్ ఇవ్వడానికి అంగీకరించడం లేదు. స్వయంగా చిత్రబృందం, లేదా హీరో వెళ్లి రిక్వెస్ట్ చేసుకుంటే వీలవుతుందే తప్ప.. లేకపోతే ప్రీమియర్స్ వేయడానికి కుదరదు. ‘అజ్ఞాతవాసి’కి కూడా అలాంటి ప్రయత్నాలే చేశారు. ఏపీలో పర్మిషన్ దొరికింది కానీ.. తెలంగాణలో మాత్రం దొరకలేదు. ఇందుకు ఒక ఫన్నీ రీజన్ కూడా ఉందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

Tellmeboss.net

‘అజ్ఞాతవాసి’ మూవీకి సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్లలో చాలావరకు సైకిల్ బొమ్మలే కనిపించాయి. చివరికి ట్రైలర్‌లోనూ అదే హైలైట్ అయ్యింది. ఇక పోస్టర్లలో కూడా సైకిల్ బొమ్మనే చూపించారు. నిజానికి ‘సైకిల్’ టీడీపీ పార్టీ గుర్తు.. ఇటు తెరాస పార్టీకి ‘కారు’ గుర్తు.. తన సినిమా పోస్టర్లలోగానీ, ట్రైలర్‌లోగానీ కారుని హైలైట్ చేయకపోవడం వల్లే కేసీఆర్ హర్ట్ అయ్యారని, అందుకే ఈ సినిమా ప్రీమియర్ షోలకి పర్మిషన్ ఇవ్వలేదని టాక్ నడుస్తోంది. ఇదే నిజమైన కారణమో లేదో ఎవ్వరికీ తెలీదు కానీ.. ఇండస్ట్రీలో మాత్రం ఈ పుకారు జోరుగా చక్కర్లు కొడుతోంది. ఏదేమైనా.. ప్రీమియర్స్‌కి పర్మిషన్ దొరక్కపోవడం ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూసే!

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.