అక్కడ ‘అజ్ఞాతవాసి’ షో క్యాన్సిల్.. నోరెళ్లపెట్టిన ఫ్యాన్స్

agnyaathavaasi show cancelled in andhra pradesh
Tellmeboss.net

బ్యాడ్ టాక్ మూటగట్టుకున్న సినిమాల జోలికి జనాలు వెళ్లరు. కానీ.. అది హీరోల స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. చిన్న హీరోల మూవీలైతే రెండోరోజుకైతే చాప చుట్టేస్తాయి. చాలా థియేటర్ల నుంచి లేపేస్తారు. అదే పెద్ద హీరోల విషయంలో మాత్రం అలా జరగదు. ఫ్లాప్ టాక్ వచ్చినా వారికున్న ఫాలోయింగ్ జనాల్ని థియేటర్లకి వచ్చేలా చేస్తుంది. దీంతో.. థియేటర్లన్నీ ఫస్ట్ వీకెండ్ మొత్తం జనాలతో కిక్కిరిసిపోతాయి. కానీ.. ‘అజ్ఞాతవాసి’ విషయంలో మాత్రం అంతా వ్యతిరేకంగా జరుగుతోంది.

Tellmeboss.net

స్వయంగా పవన్ కళ్యాణ్ అభిమానులే సినిమా ఏమాత్రం బాగోలేదని పెదవి విరుస్తుండడంతో సాధారణ ప్రేక్షకులు దాన్ని పూర్తిగా తిరస్కరించేశారు. మొదటి రోజు జనాలతో కిక్కిరిసి పోయిన రెండో రోజు పరిస్థితి మారిపోయింది. పవన్, త్రివిక్రమ్ కాంబో టెంప్టింగ్‌గా ఉన్నప్పటికీ.. ఫ్లాప్ టాక్ రావడంతో ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు. అందుకే.. హౌస్‌ఫుల్ బోర్డులతో నిండిపోవాల్సిన థియేటర్లు జనాలు లేక వెలవెలబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఐదు షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినా.. రెండు షోలకు కూడా ప్రేక్షకులు రావడం లేదు. కనీసం 50 శాతం కూడా థియేటర్లు ఫుల్ అవ్వట్లేదు. ఇక ఆంధ్రలో అయిన పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

అక్కడ రోజుకు ఏడు షఓలు వేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం పర్మిషన్ ఇష్తే.. మామాలుగా నాలుగు షోలకే హాలు నిండే పరిస్థితి లేదు. మొదటిరోజు తప్ప ఆ తర్వాత ఏడు షోలకూ టికెట్లు తెగట్లేదని ధియేటర్ల సిబ్బంది చెబుతున్నారు. పెందుర్తిలో అయితే గురువారం సాయంత్రం ఓ థియేటర్‌లో జనాలు లేక సినిమా ప్రదర్శనే నిలిపివేశారు. దీన్ని బట్టి ఈ సినిమా ఎంతగా నిరాశపరిచిందో అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్‌లాంటి స్టార్ హీరో సినిమాకి ఇలా జరగడం నిజంగా అవమానకరమే!

Tellmeboss.net
Related posts:
మంచి కిక్‌: శ‌్రీమంతుడుతో ర‌వితేజ ఢీ
ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన మ‌హేష్‌(వీడియో)
అల్లుఅర్జున్, బోయపాటి శ్రీను, రకుల్‌ప్రీత్‌ల ‘సరైనోడు’ మూవీ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సెన్సార్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే?
హిందీలో హిస్టరీ క్రియేట్ చేసిన ‘బాహుబలి-2’.. 14 రోజుల్లోనే రికార్డులన్నీ మటాష్
వక్కంతం పుణ్యమా అని అల్లు - అర్జున్ దెబ్బలాట!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.