‘అజ్ఞాతవాసి’ ధమాకా షురూ.. యూఎస్‌లో అప్పుడే హాఫ్ మిలియన్

Agnyaathavaasi USA pre sales report

‘అజ్ఞాతవాసి’ చిత్రంపై నెలకొన్న అంచనాల దృష్ట్యా ఇది కలెక్షన్ల పరంగా రికార్డుల పరంపర కొనసాగించడం ఖాయమనే అభిప్రాయాలు ఇదివరకే వెల్లడయ్యాయి. ట్రేడ్ వర్గాలు, సినీ విశ్లేషకులందరూ ఈ చిత్రం కలెక్షన్ల మోత మోగిస్తుందని ఇదివరకే అంచనా వేశారు. అందుకు తగినట్లుగానే ఈ చిత్రం అప్పుడే ధమాకా మొదలెట్టేసింది. ముందుగానే బుకింగ్స్ ఓపెన్ చేయగా.. రికార్డ్ స్థాయిలో బుక్కైనట్లు సమాచారం.

యూఎస్‌లో ఈ చిత్రాన్ని ఇండియన్ హిస్టరీలోనే ఏ మూవీని రిలీజ్ చేయనన్న లొకేషన్స్ (580)లో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు చాలా లొకేషన్స్‌లో బుకింగ్స్ ఓపెన్ చేయగా.. 415 లొకేషన్స్‌లో టికెట్స్ బుక్ అయిపోయాయని, తద్వారా $513,000 నమోదైనట్లు అక్కడి ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నిజానికి.. ఈ చిత్రం ప్రీమియర్స్‌ని అక్కడ ఈనెల 9వ తేదీన ప్రదర్శించబోతున్నారు. అంటే.. మూడురోజుల ముందే దీని ప్రభంజనం మొదలైపోయింది. దీన్నిబట్టి.. ఈ చిత్రంపై ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా రిలీజ్‌కి దగ్గరపడేకొద్దీ ఈ ఫిగర్ మరింత పెరగడం ఖాయమని.. ఇదివరకు ప్రెడిక్ట్ చేసినట్లుగా ప్రీమియర్స్ ద్వారా ‘అజ్ఞాతవాసి’ 2 మిలియన్ మార్క్‌ని అందుకోవడం ఖాయమని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే.. ఈ చిత్రం చరిత్ర సృష్టించట్లే!

పవన్ కళ్యాణ్‌కి ఉన్న విపరీతమైన ఫాలోయింగ్, త్రివిక్రమ్‌కి యూఎస్‌లో మంచి పట్టు ఉండడం, పైగా వీరి కలయికలో ఇది మూడో సినిమా కావడంతో.. అంచనాలు ఇలా పీక్స్‌లో ఉన్నాయని, అందుకే ఇలా ప్రీ-సేల్స్ జరుగుతున్నాయంటున్నారు. ఒకవేళ ఈ మూవీ అంచనాల్ని అందుకోవడం సక్సెస్ అయితే.. ఇక కలెక్షన్ల సునామీని ఆపడం కష్టమే! మరి.. రిజల్ట్ ఎలా వస్తుందో వేచి చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.