10 కాదు.. 20 పాయే.. ఇంకా రివీల్ కాని అఖిల్ మిస్టరీ!

తన తొలిచిత్రం ‘అఖిల్’ ఘోరంగా విఫలం కావడంతో అఖిల్ అక్కినేని చాలాకాలంపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మొదటి సినిమానే అలా డిజాస్టర్ కావడంతో తీవ్ర మనోవేదనకు గురై, కొన్నాళ్లు ఎవరి కంటికి కనిపించలేదు. ఇప్పుడు కూడా అఖిల్ అదే అజ్ఞాతాన్ని పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. తన రెండో చిత్రం ‘హలో’ కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. క్రిటిక్సి నుంచి మంచి మార్కులు వేయించుకున్నప్పటికీ.. ప్రేక్షకుల ఆదరణని సంపాదించలేకపోయింది. అందుకే.. ఈ మూవీ కమర్షియల్‌గా డిజాస్టర్ అయ్యింది. ఈ దెబ్బకు అఖిల్ మళ్ళీ కనిపించకుండా పోయాడు.

నిజానికి.. ‘హలో’కి పాజిటివ్ టాక్ వచ్చిన కొత్తలో అఖిల్ రెండు, మూడు రోజులపాటు హుషారుగా కనిపించాడు. ఈ ఉత్సాహంలోనే ఓ ఆసక్తికరమైన విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు. తన మూడో ప్రాజెక్ట్ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందని.. ఆ వివరాల్ని సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన వెల్లడిస్తానని తెలిపాడు. కానీ.. 10 తేదీ దాటిపోయి ఇప్పుడు 20 కూడా వచ్చేసింది. అయినా అఖిల్ తన మూడో చిత్రం గురించి ఒక్క మాట కూడా చెప్పకపోగా, అసలు మీడియా కంటికి కూడా కనిపించడం లేదు. పదో తేదే మూడో మూవీ గురించి చెప్తానన్న అఖిల్.. ఇలా సైలెంట్ అయిపోవడానికి కారణం ఏంటో? బహుశా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయిందేమో! దీనిపై స్పష్టత రావాలంటే.. అఖిల్ లేదా నాగ్ స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే.

Related posts:
ఉద‌యం డీలాప‌డ్డ జ‌క్క‌న్న‌...సాయంత్రానికి ఫుల్ ఖుషీ
డిక్టేట‌ర్ ఆడియోకు ముహూర్తం ఫిక్స్‌!!
కనుమరుగైన సీనియర్ తారలకి ‘లైఫ్’ ఇస్తున్న కొరటాల
పవన్ కొత్త సినిమా స్టోరీలైన్ ఇదే.. కెరీర్‌లో తొలిసారి..
‘జై లవ కుశ’ వరల్డ్‌వైడ్ ఫైనల్ కలెక్షన్స్.. సౌత్ ఇండియాలోనే తారక్ ఫస్ట్!
దానికోసం తమన్నా తంటాలు.. అక్కడయినా దక్కేనా?

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.