శ్రీరెడ్డి ఎఫెక్ట్‌.. అఖిల్ సినిమా హాంఫట్

పాపం అఖిల్.. ఏ ముహూర్తాన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడో తెలీదు కానీ మొదట్నుంచీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఎంతో శ్రద్ధతో, నమ్మకంతో చేసిన రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. ఇప్పుడు అంతకుమించి పెద్ద షాక్ తగిలింది. పట్టాలెక్కాల్సిన ప్రాజెక్ట్ చిక్కుల్లో పడింది. అసలు సెట్స్ మీదకి వెళ్తుందో లేదో గ్యారెంటీ లేకుండా పోయింది.

ఇదంతా ఆ శ్రీరెడ్డి వల్లే! ఈమె ఎఫెక్ట్ అఖిల్ మూవీపై ఎంత తీవ్రంగా పడిందంటే.. పక్కాగా అతని ప్రాజెక్ట్ అటకెక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అసలు ఆమెకి, అఖిల్ మూవీకి లింకేంటి? అని అనుకుంటున్నారా! ఇంకెవరూ.. రాంగోపాల్ వర్మనే! వర్మతో ‘ఆఫీసర్’ సినిమా చేస్తున్న నాగ్.. ఈ మూవీ షూటింగ్ టైంలోనే అఖిల్ నాలుగో సినిమా కోసం అతనితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే! కానీ.. వర్మ చేసిన ఒక రచ్చ కారణంగా ఇప్పుడు ఆ రెండు సినిమాలు ఎటూకాకుండా పోయాయి. శ్రీరెడ్డి ఇష్యూలో తలదూర్చి.. ఆ ఇద్దరి సినిమాల్ని చిక్కుల్లో పడేశాడు.

అసలు విషయం ఏంటంటే.. నటి శ్రీరెడ్డి తన ‘క్యాస్టింగ్ కౌచ్’ పోరాటం ఏంటో తాను చేసుకుంటుంటే, అందులో వర్మ తలదూర్చాడు. సరే.. ఆమెకి మద్దతివ్వడం మంచిదే కానీ, ఇష్యూని మరింత హైలైట్ చేయడం కోసం పవన్‌ని తిట్టమని ఆమెకు సూచించాడు. ఆల్రెడీ పాపులారిటీ వచ్చిన పొగరులో రెచ్చిపోతున్న శ్రీరెడ్డికి.. వర్మ సలహా ‘కోతి చేతికి కొబ్బరి చిప్ప’ దొరికినట్టయ్యింది. అంతే.. వెంటనే మీడియా ముందుకొచ్చి పవన్‌పై ‘MC’ పదం వాడేసింది. ఆ దెబ్బతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోల వాతావరణం నెలకొంది. శ్రీరెడ్డిని టార్గెట్ చేస్తూ.. ప్రతిఒక్కరూ ఏకిపారేశారు.

అయితే.. దీని వెనుక వర్మ ఉన్నాడని ప్రేక్షకులు మరింత అసహనానికి గురయ్యారు. ఎంతో గొప్పవాడైన వర్మ.. మరీ ఇంత దిగజారుడు పనులకు పూనుకుంటాడా? అంటూ అతనిపై ద్వేషం పెంచుకున్నారు. టాలీవుడ్ పెద్దలందరూ వర్మని ఫుట్‌బాల్ ఆడేసుకుంటున్నారు. అతను చేసింది ముమ్మాటికీ పెద్ద తప్పు కావడంతో.. నిషేధం వేటు వేసే దిశగా ఆలోచిస్తున్నట్టు కూడా టాక్ వినిపిస్తోంది. ఇదే గనుక జరిగితే.. నాగ్ ‘ఆఫీసర్’, అఖిల్ 4వ చిత్రాలు అటకెక్కినట్లే! చివరికి ఏమవుతుందో చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.