పెళ్ళిలో సమంత ఫ్యామిలీ మిస్సింగ్.. షాకింగ్ నిజాలివే!

Tellmeboss.net

ఈనెల 6, 7వ తేదీల్లో నాగచైతన్య, సమంత పెళ్ళి గోవాలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. హిందూ సాంప్రదాయం ప్రకారం 6న జరగ్గా, 7వ తేదీన క్రిష్టియన్ పద్ధతిలో ఆ జంట రెండుసార్లు పెళ్ళి చేసుకుంది. ఇక ఈ పెళ్లికి సంబంధించి రిలీజైన ఫోటోల్ని, వీడియోల్ని బట్టి.. దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీతోపాటు వారికి సన్నిహితంగా వుండే కొందరు ఇండస్ట్రీ సెలెబ్రిటీలు కూడా హాజరైనట్లు తెలిసింది. వారంతా పెళ్ళిలో చేసిన హంగామా అంతాఇంతా కాదు. ముఖ్యంగా.. దగ్గుబాటి, అక్కినేని కుటుంబాలు డ్యాన్స్ షోలు చేసి.. ఆ పెళ్ళి వేడుకకే ప్రత్యేక కళ తీసుకొచ్చారు. అంతా బాగానే వుంది కానీ.. ఆ ఫోటోల్లో, వీడియోల్లో సమంత ఫ్యామిలీకి సంబంధించినవారెవరూ కనిపించలేదు. కనీసం ఒక్క ఫోటోలోనూ వారి జాడ కనిపించలేదు.

Tellmeboss.net

దీంతో.. ఈ పెళ్లి సమంత ఫ్యామిలీకి ఇష్టం లేదా? అనే అనుమానాలు రేకెత్తడం మొదలయ్యాయి. ఒకవేళ ఈ పెళ్ళి వారికీ ఇష్టమే అయితే.. ఎందుకు ఫోటోల్లో కనిపించలేదంటూ ప్రశ్నలు లేవనెత్తాయి. అసలేం జరిగింది? అనే వ్యవహారంపై ఆరాతీయగా.. అసలు విషయం బయటపడింది. సమంత కుటుంబసభ్యులు కూడా ఫోటోలు దిగారట. కాకపోతే.. వాటిని బయటకు రిలీజ్ చేయలేదని తెలిసింది. ఎందుకంటే.. సమంత ఫ్యామిలీ మొత్తం ఫోటోల్లో కనిపిస్తే, తమ గురించి ప్రపంచానికి తెలిసిపోయి, తమకంటూ ప్రైవసీ లేకుండా పోతుందనే భయంతో ఫోటోలు రిలీజ్ చేయొద్దని నాగార్జునను రిక్వెస్ట్ చేశారట. వారి రిక్వెస్ట్‌ని కాదనలేక.. వాళ్లున్న ఫోటోలని నాగ్ బయటకు రిలీజ్ చేయలేదని తెలిసింది. ఇదండి అసలు విషయం.

Tellmeboss.net
Related posts:
బాహుబ‌లి ఆయ‌న‌కే అంకిత‌మా.. జ‌క్క‌న్న గ్రేట్‌
మ‌హేష్ కోసం మ్యూజిక్ డైరెక్ట‌ర్ల వార్‌!!
‘నాన్నకు ప్రేమతో’ ఆడియో వేడుకలో ఊహించని ట్విస్ట్..?
‘ఐఫా’ రెజీనా రెచ్చిపోవడానికి కారణం అదేనా?
సేథుపతితో ఘర్షణకు రెడీ అవుతున్న వెంకీ
మెగా బ్రదర్స్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.