పవన్ గురించి పచ్చి నిజాలు.. అందుకే దూరం : ఆలీ

Tellmeboss.net

పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితంగా వుండేవాళ్లలో కమెడియన్ ఆలీ కూడా ఒకరు. సినిమాలపరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ వీరిద్దరి మధ్య ఎంతో మంచి సాన్నిహిత్యం వుంది. ఆ బంధంతోనే పవన్ తన ప్రతి సినిమాలోనూ ఆలీని తీసుకుంటుంటాడు. తోడుగా ఆలీ వుంటే తనకో ధైర్యం వస్తుందని ఆమధ్య ఓ ఈవెంట్‌లో స్వయంగా పవనే చెప్పి.. తమ మధ్య ఎంత గట్టి రిలేషన్ వుందో చెప్పకనే చెప్పాడు. వీరిద్దరి మధ్య ఇంత క్లోజ్ ఫ్రెండ్‌షిప్ వుండడంతో.. పవన్ స్థాపించిన ‘జనసేన’ పార్టీ వ్యవహారాల్లో ఆలీ పాత్ర కూడా కీలకంగా వుండొచ్చునని అభిప్రాయాలు వెలువడ్డాయి. బహుశా పైకి అతని పేరు రాకపోయినా.. వెనుకుండి కీ-రోల్ పోషించే ఛాన్స్ వుండొచ్చని ఊహాగానాలొచ్చాయి. అయితే.. అవన్నీ రూమర్లేనని ఆలీ ఆ వార్తల్ని కొట్టిపారేశాడు. అసలు తనకు పార్టీ పెడుతున్న విషయమే పవన్ చెప్పలేదని, పార్టీకి హెల్ప్ చేయమని ఎవ్వరిని అడగలేదని అన్నాడు.

Tellmeboss.net

‘‘ప‌వ‌న్ క‌ల్యాణ్ నాకు చాలా మంచి స్నేహితుడు. మేము కలిసిన ప్రతిసారి సినిమాల గురించిగానీ, సరదాగా ఏవో కబుర్లుగానీ మాట్లాడుకుంటాం. అంతే తప్ప.. మా ఇద్దరి మధ్య ఏనాడూ రాజకీయాల ప్రస్తావన రాలేదు. తాను పార్టీ పెడుతున్న విషయం కూడా పవన్ చెప్పలేదు. ఇప్పటివరకు ఎవరినీ పార్టీకోసం హెల్ప్ చేయమని ఆయన అడగలేదు. చివరికి నన్ను కూడా రమ్మనలేదు. త‌న పిలుపుతో మిత్రులు, స‌న్నిహితులు రాజకీయాల్లోకి అడుగుపెడితే వారు కూడా తిట్లను, విమ‌ర్శ‌ల‌ను, బెదిరింపులను ఎదుర్కోవలసి వస్తుందనేది ప‌వ‌న్ అభిప్రాయ‌ం. అలా జరగడం త‌న‌కు మరింత బాధ కలిగిస్తుందని ప‌వ‌న్‌ చెప్పారు. తాను స్థాపించిన పార్టీకి సంబంధించి ఏం జరిగినా తానే చూసుకుంటానని… మంచైనా, చెడైనా తానే ఎదుర్కొంటాననీ ఆయన పేర్కొన్నారు. ఏదైనా అత్యవసరం అనిపించినప్పుడు మిత్రులు, స‌న్నిహితుల‌కు చెబుతానని పవన్ నాతో అన్నారు. జ‌న‌సేనానిగా పవన్ చేస్తున్నది ఒంటరిపోరాటం’’ అని రీసెంట్‌గా ఇచ్చిన ఆలీ వివరణ ఇచ్చారు.

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.