మహేష్ దెబ్బకు కోమాలోకి వెళ్లిన బన్నీ..?

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తన లేటెస్ట్ మూవీ ‘నా పేరు సూర్య’ని రిలీజ్ చేసే ఎగ్జైమెంట్‌లో ఉన్నాడు కానీ.. ఆ తదుపరి సినిమా విషయంలోనే పెద్ద కన్ఫ్యూజన్‌లో పడిపోయాడు. ఆమధ్య మహేష్‌కి పడిన ఓ భారీ దెబ్బ కారణంగా.. అసలు పావులు ఎలా కదపాలో తెలియని తికమకలో పడిపోయాడు. ‘‘అదేంటి? స్టార్ హీరో అయిన బన్నీకి ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా స్వేచ్ఛ ఉంది.. అలాంటి హీరో నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయమై టెన్షన్‌లో పడటం ఏంటి?’’ అనేగా మీ సందేహం! అక్కడికే వస్తున్నాం…

నిజానికి.. ‘డీజే’ మూవీ ఇంకా సెట్స్ మీద ఉన్నప్పుడే బన్నీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లింగుస్వామితో కన్ఫమ్ చేసుకున్నాడు. తెలుగు-తమిళ్ బైలింగ్వల్ ప్రాజెక్ట్ కోసం ఒప్పందం కుదుర్చున్నాడు. అప్పట్లో అంటే 2016లో స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ వారు భారీ ప్రెస్‌మీట్ మధ్య బన్నీని అక్కడ లాంఛ్ చేసింది కూడా! లింగుస్వామి డైరెక్షన్‌లో బన్నీ ఓ ద్విభాషా చిత్రం చేస్తున్నాడని ఓ రేంజులో కార్యక్రమం నిర్వహించింది. అప్పట్లో ఈ మూవీ చేసేందుకు బన్నీ కూడా ఉత్సాహంగానే ఉన్నాడు కానీ.. ఎప్పుడైతే ‘స్పైడర్’ రిలీజైందే అప్పట్నుంచి మనోడిలో వణుకు పుట్టింది.

మురుగదాస్-మహేష్ కాంబోలో వచ్చిన ఆ చిత్రం డిజాస్టర్‌గా నిలవడంతో.. లింగుస్వామితో ఒప్పందం కుదుర్చుకున్న బైలింగ్వల్ ప్రాజెక్ట్ చేయాలా? వద్దా? అనే తికమకలో బన్నీ పడిపోయాడు. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేద్దామనుకుంటే.. అప్పట్లో మీడియా ముందు భారీగా లాంఛ్ చేసిన నేపథ్యం మనోడ్ని వెనకడుగు వేసేలా చేస్తోంది. పోనీ.. ధైర్యంగా ముందుకెళ్దామనుకుంటే ‘స్పైడర్’ రిజల్ట్ గుబులు రేపుతోంది. అందుకే.. ఏం చేయాలో తెలీక ‘కోమా’లో వుండే పేషెంట్ స్టేజ్‌లోకి వెళ్లిపోయాడు మన స్టైలిష్ స్టార్. చివరికి ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Related posts:
తనయుల కోసం త్యాగం చేసిన నాగార్జున
‘శాతకర్ణి’లో కొత్త ట్విస్ట్.. యంగ్ హీరోకి బంపరాఫర్?
మెగా బ్రదర్స్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!
నేనే రాజు నేనే మంత్రి క్లైమాక్స్.. గూస్‌బంప్స్ గ్యారెంటీ!
త్రివిక్రమ్ దెబ్బకు తారక్ ‘నవ్వుల’పాలు
‘అజ్ఞాతవాసి’.. చివరి నిమిషంలో పెద్ద బాంబ్!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.