దెబ్బేసిన బన్నీ.. పాపం విక్రమ్!

‘నా పేరు సూర్య’ చిత్రం బాగా దెబ్బేయడంతో.. తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్! ఈసారి రొటీన్‌కి భిన్నంగా వద్దామని నిర్ణయించుకుని, సరైన స్ర్కిప్ట్ కోసం పరిశీలించడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో తన వద్దకు ఎంతోమంది దర్శకులు రాగా.. చివరికి విక్రమ్ కె.కుమార్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘24’ మూవీ తరహాలో ఒక డిఫరెంట్ స్టోరీ వినిపించడంతో.. అదే స్టోరీతో సెట్స్ మీదకి వెళ్దామని బన్నీ డిసైడ్ అయ్యాడు.

బన్నీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది కాబట్టి.. ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేసే పనిలో బిజీ అయిపోయాడు విక్రమ్! అతని కోసం వేరే ప్రాజెక్టుల్ని పక్కనపెట్టేసి మరీ దీని మీదే ఫుల్ ఫోకస్ పెట్టాడు. స్ర్కిప్ట్ పూర్తయ్యాక అన్ని ఫైనల్ చేసుకుని.. సెట్స్ మీదకి వెళ్దామని పక్కా ప్లాన్ వేసుకున్నాడు. కానీ.. ఇంతలోనే బన్నీ బాంబ్ పేల్చేశాడు. విక్రమ్ ప్రాజెక్ట్‌ని పక్కనపెట్టి.. త్రివిక్రమ్‌తో సెట్స్ మీదకి వెళ్దామని బన్నీ ఆలోచిస్తున్నాడట! ఇదివరకే తమ కాంబోలో వచ్చిన చిత్రాలు కమర్షియల్‌గా మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు తానున్న పరిస్థితుల్లో.. త్రివిక్రమ్‌తో మూవీ చేస్తేనే పవర్‌ఫుల్‌గా బౌన్స్ బ్యాక్ అవ్వొచ్చని బన్నీ గట్టి నమ్మకం!

పైగా.. ఎక్స్‌పరిమెంట్ సినిమాల సక్సెస్ రేటు చాలా తక్కువ! కేవలం క్లాస్ ఆడియెన్స్‌ దృష్టినే ఇవి ఆకర్షిస్తాయి. అదే కమర్షియల్ జోనర్‌లో మంచి సబ్జెక్ట్‌తో సినిమా చేస్తే.. క్లాస్‌తోపాటు మాస్ ఆడియెన్స్ కూడా థియేటర్లకు పరుగులు తీస్తారు. ఇలాంటి చిత్రాల్ని త్రివిక్రమ్ తన మార్క్ స్టైల్‌లో హ్యాండిల్ చేయడంలో దిట్ట కాబట్టి.. తన తదుపరి ప్రాజెక్ట్ అతనితోనే చేయాలని బన్నీ మొగ్గుచూపుతున్నాడట! తారక్‌తో ‘అరవింద సమేత’ మూవీ చేశాక త్రివిక్రమ్ కూడా ఖాళీగానే వుంటాడు కాబట్టి.. ఇతను బన్నీతో జతకట్టే ఛాన్స్ ఎక్కువగా వుంది. మరి.. వీళ్ళ కాంబో కుదురుతుందో లేదో చూడాలి!

ఒకవేళ ఈ కాంబినేషన్ కుదిరితే మాత్రం.. విక్రమ్ కుమార్ నిండా మోసపోయినట్లే! అదేపనిగా ఇతర ప్రాజెక్టులు పక్కనపెట్టి మరీ బన్నీ కోసం స్ర్కిప్ట్ రెడీ చేసే పనిలో వుంటే.. మనోడు సైలెంట్‌గా సైడైపోయి, త్రివిక్రమ్‌తో చేతులు కలపడం కరెక్ట్ కాదని చెప్పుకోవచ్చు. అయినా ఇండస్ట్రీలో ఎప్పుడేం జరుగుతుందో పసిగట్టడం కష్టమే! చూద్దాం.. చివరికి ఏమవుతుందో! వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘జులాయి’.. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. సో.. ఈ కాంబినేషన్ ఫైనల్ అయ్యే అవకాశం ఉందని టాక్. అలా జరిగితే.. విక్రమ్ ఇప్పుడు మరో హీరోను వెతుక్కోవాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.