సెట్స్‌పై కుప్పకూలిన మెగాస్టార్.. షాక్‌లో ఫ్యాన్స్!

మెగాస్టార్‌కు సంబంధించి ఎలాంటి న్యూస్ వచ్చినా చాలా ఆసక్తిగా తిలకిస్తారు ఫ్యాన్స్. అలాంటి మెగాస్టార్ అస్వస్థతకు గురై సెట్స్‌లోనే పడిపోవడంతో తమ అభిమాన నటుడికి ఏమయ్యిందా అంటూ ఆరా తీస్తున్నారు అభిమానులు. అయితే ఇక్కడ మెగాస్టార్ అంటే చిరంజీవి కాదులెండీ.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.

బాలీవుడ్‌లో మరే హీరోకు లేని పాపులారిటీ సాధించిన మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తాజాగా ‘‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’’ చిత్రంలో నటిస్తున్నాడు. అమీర్ ఖాన్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ ఒక కీలకమైన పాత్రలో కనిపిస్తాడు. కాగా తాజాగా ఈ చిత్ర షూటింగ్ సెట్స్‌పై ఆయన అస్వస్థతతో కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయన్ను జోధ్‌పూర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వీలైనంత త్వరగా ఆయన్ను ముంబయిలోని లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారట. గతంలోనూ ఫిబ్రవరి నెలలో తీవ్ర బ్యాక్‌పెయిన్ కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

అమితాబ్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడికి ఏం కాకూడదని వారు ప్రార్థిస్తున్నారు. అమితాబ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఎలాంటి న్యూస్ వస్తుందా అని చాలా టెన్షన్‌గా ఉన్నారు ఫ్యాన్స్.

Related posts:
శ్రీమంతుడు ఆడియో రిలీజ్ డేట్ & ప్లేస్ డీటైల్స్‌
నాగార్జున కెరీర్‌ని ఇబ్బంది పెట్టిన ఆ ‘క్షణం’
నాని, సురభి, నివేద థామస్‌ల ‘జెంటిల్‌మన్’ మూవీ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్
వెంకటేష్, రితికా సింగ్‌ల ‘గురు’ మూవీ రివ్యూ-రేటింగ్
మహేష్ ‘స్పై-డర్’ లుక్.. ఇంటర్నెట్‌ని ఓ కుదుపు కుదిపేస్తోంది!
ఫస్ట్ లుక్ పోస్టర్.. ఎన్టీఆర్ రాక్స్.. క్రియేటివిటీ పీక్స్!!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.