నాగశౌర్య, షామిలీల ‘అమ్మమ్మాగారిల్లు’ మూవీ రివ్యూ-రేటింగ్

సినిమా : అమ్మమ్మ‌గారిల్లు
న‌టీన‌టులు : నాగ‌శౌర్య‌, షామిలి, రావు ర‌మేష్‌, సుమిత్ర, శివాజీరాజా, హేమ‌, త‌దిత‌రులు
క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం : సుంద‌ర్ సూర్య‌
నిర్మాత‌: రాజేష్‌
సంగీతం : క‌ళ్యాణ ర‌మ‌ణ
సినిమాటోగ్రఫీ : ర‌సూల్ ఎల్లోర్‌
ఎడిటర్ : జె.పి
బ్యానర్ ‌: స్వాజిత్ మూవీస్‌
విడుద‌ల‌ తేదీ : 25-05-2018

తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరోల్లో నాగశౌర్య ఒకడు! రీసెంట్‌గానే ‘ఛలో’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఈ లవర్‌బాయ్.. తాజాగా ‘అమ్మమ్మగారిల్లు’ అనే కుటుంబ కథాచిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఒక‌ప్పుడు బాల‌న‌టిగా ఆక‌ట్టుకున్న షామిలి ఇందులో క‌థానాయిక‌గా న‌టించింది. సుందర్ సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. మరీ భారీ స్థాయిలో కాకపోయినా ఒకింత క్రేజ్ సంపాదించుకుంది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ వచ్చి చాలాకాలం అయ్యింది కాబట్టి.. జనాల దృష్టి ఈ మూవీపై పడింది. మరి.. ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం..!

కథ :
సీతామహాలక్ష్మి(సుమిత్ర)ది పెద్ద కుటుంబం. ఆస్తి పంపకాల విషయంలో గొడవలు రావడంతో.. కుటుంబ పెద్ద రంగారావు (చలపతిరావు) కలత చెంది చనిపోతాడు. దాంతో కుటుంబం మొత్తం చెల్లాచెదురవుతుంది. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు తలో దిక్కు వెళ్లిపోతారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళందరూ 20 ఏళ్ళు అయినప్పటికీ తిరిగిరారు. అయితే.. తన పిల్లలంతా కలిసి ఏకమైతే చూడాలని సీతామహాలక్ష్మీ కోరుకుంటుంటుంది. అమ్మమ్మ కోరికను తెలుసుకున్న సంతోష్ (నాగశౌర్య).. తిరిగి అందరినీ కలపాలని నిర్ణయించుకుంటాడు. అందుకు అతను ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ఏంటి? 20 ఏళ్ళ క్రితం విడిపోయిన కుటుంబం తిరిగి ఏకమవుతుందా? తన అమ్మమ్మ ముఖంలో సంతోష తిరిగి సంతోషం నింపగలిగాడా? అనే అంశాలతోనే ఈ సినిమా సాగుతుంది.

విశ్లేషణ :
ట్రెండ్ ఎంత మారినా.. ఫ్యామిలీ సినిమాలు ఎప్పుడూ ప్రత్యేకమే! మన రియల్ లైఫ్‌కి సంబంధించిన ఎమోషన్స్‌తో ఆ చిత్రాలు రూపొందుతాయి కాబట్టి.. ఇప్పటికీ జనాల్లో వాటికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాగని ఏదిపడితే అది చూడరు.. తమ అంచనాల్ని తీసిపోకుండా అన్ని ఎమోషన్స్‌ని టచ్ చేయగల సినిమాల్నే ఆస్వాదిస్తారు.. ఆదరిస్తారు. ‘అమ్మమ్మగారిల్లు’ కూడా అదే కేటగిరికి చెందిన సినిమాగా చెప్పుకోవచ్చు.

ఇది మన అందరికీ తెలిసిన కథే! ఒక పెద్ద కుటుంబం.. ఆస్తి గొడవలతో ఫ్యామిలీ చీలిపోవడం.. పెద్దలకు అది ఎంతో బాధ కలిగించడం.. చివరికి తిరిగి ఏకమవ్వడం.. వంటి అంశాల చుట్టూ తిరిగేదే ఈ సినిమా! తెలిసిన కథే అయినా.. దర్శకుడు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడంలో సక్సెస్ అయ్యాడు. కొన్ని చోట్ల తడబడినప్పటికీ.. గుండెల్ని పిండే ఎమోషన్స్‌తో ఆకట్టుకోగలిగాడు. అక్కడక్కడ నవ్విస్తూ.. కుటుంబ విలువల్ని, బంధాలు – అనుబంధాల గొప్పతనాల్ని చాటిచెప్పాడు. చాలారోజుల తర్వాత మరో స్వచ్ఛమైన కుటుంబ కథను చూసిన అనుభూతిని కలిగించాడు దర్శకుడు సూర్య.

ఆరంభ సన్నివేశాలే ప్రేక్షకుల్ని హత్తుకుంటాయి. సినిమాలో లీనమయ్యేలా చేస్తాయి. అలా కథలోకి వెళ్లిపోయిన ప్రేక్షకులు.. చివరికి వరకు బయటకు రాకుండా చేశాడు దర్శకుడు. ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేశాడు. రావురమేశ్‌, నాగశౌర్య పాత్రలను అల్లిన విధానం చాలా బాగుంది. వీరి పాత్రలొచ్చినప్పుడల్లా కథలో బలం, వేగం పుంజుకుంటాయి. అయితే.. మధ్యలో కథ కాస్త నెమ్మదిస్తుంది. అలాగే.. నాగశౌర్య, షామిలీల లవ్ ట్రాక్ బలంగా లేకపోవడం, కథలో ట్విస్టులు ఉండకపోవడంతో సినిమాకి కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి.

అయితే.. ఆ ఫీలింగ్ పెద్దగా కలిగించకుండా దర్శకుడు సినిమాని ప్రేక్షకులు మెచ్చేలా బాగానే డీల్ చేయగలిగాడు. భావోద్వేగాలు, స్వచ్ఛమైన వినోదం, కుటుంబ నేపథ్యం.. తదితర అంశాల్ని ఆడియెన్స్‌ని కట్టిపడేసేలా సరిగ్గా హ్యాండిల్ చేయగలిగాడు. అయితే.. కొత్తగా కోరుకునేవాళ్ళకు, మాస్ ఆడియెన్స్‌కి ఈ చిత్రం రుచికరంగా ఉండకపోవచ్చు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్ని ఇష్టపడేవాళ్ళకు ఇది మంచి టైంపాస్ మూవీ!

నటీనటుల పెర్ఫార్మెన్స్ :
సంతోష్ పాత్రలో నాగశౌర్య చక్కగా ఒదిగిపోయాడు. అల్లరచిల్లరగా కాకుండా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు. ముఖ్యంగా.. ఎమోషనల్స్ సీన్స్ దగ్గర భావోద్వేగాలు బాగా పండించి.. నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. షామిలీ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేయగలిగింది. అక్కడక్కడ తేడా కొట్టినట్లు అనిపించినా.. ఫర్వాలేదనిపించింది. ఇక రావు రమేష్ ఎప్పట్లాగే తన చాతుర్యాన్ని చాటిచెప్పాడు. కుటుంబ కథలకు తనెంతో బలమో నిరూపించాడు. ఆవేశపరుడైన ఇంటి పెద్దకొడుకుగా ఆయన నటన హావభావాలు చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. స్నేహితుడి పాత్రలో షకలక శంకర్ నవ్వించడానికి బాగానే ట్రై చేవాడు. మిగతా నటీనటులందరూ తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకోగలిగారు.

సాంకేతిక ప్రతిభ :
సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రసూల్ ఎల్లోర్ తన కెమెరా పనితనంతో ఈ చిత్రానికి అందం తీసుకొచ్చాడు. కళ్యాణ్ రమణ సంగీతం చక్కగా కుదిరింది. కత్తెరకు కాస్త పని చెప్పి ఉండుంటే.. ఇంకా బాగుండేది. మాటలైతే ఈ చిత్రానికి ప్రాణం పోశాయని చెప్పుకోవచ్చు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఇక దర్శకుడు గురించి మాట్లాడితే.. పాత కథనే ఎంచుకున్నా.. వెండితెరపై దాన్ని తీర్చిదిద్దిన విధానం మాత్రం మెచ్చుకునేలా ఉంది. ముఖ్యంగా మాటలు చిత్రానికి ప్రాణం పోశాయి. దర్శకుడు పాత కథనే కొత్తగా తీర్చిదిద్దిన విధానం మెచ్చుకునేలా ఉంది. కొన్నిచోట్లా మైనస్ పాయింట్ ఉన్నప్పటికీ.. మిగిలిన చోట్ల తన ప్రతిభ చాటిచెప్పాడు.

చివరగా : అనుబంధాల్ని పంచే ‘అమ్మమ్మగారిల్లు’
రేటింగ్ : 3/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.