ఇది ట్విస్టులకే ట్విస్టు.. సాక్ష్యాలతో జయలలిత – శోభన్‌బాబు కూతురు

Amrutha Claims She Is Daughter Of Jayalalitha Shobhan Babu
Tellmeboss.net

దివంగత సీఎం జయలలిత మరణించిన తర్వాత ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో ఎక్కువ దుమారం రేపింది మాత్రం.. జయలలిత, శోభన్‌బాబుకి మధ్య సంబంధం ఉందన్న వార్త! జయ అందానికి దాసోహమైన శోభన్‌బాబు ఆమెని ప్రేమించారని, జయ కూడా ప్రేమించిందని, ఇద్దరూ పెళ్ళిచేసుకోకుండా సహజీవనం చేశారని వార్తలొచ్చాయి. అంతేకాదు.. ఈ ఇద్దరికీ ఓ కూతురు ఉందనే ప్రచారం కూడా ఓ రేంజులో జోరందుకుంది. కొన్నిరోజులపాటు ఈ వార్త సౌత్ ఇండస్ట్రీనే షేక్ చేసింది. ఇక రోజులు గడిచేకొద్దీ ఇదో పచ్చి అబద్ధమని అంతా అనుకున్నారు.

Tellmeboss.net

కానీ.. ఇంతలోనే జయకి, శోభన్‌బాబుకి జన్మించిన బిడ్డని తానేనంటూ అమృత అమ్మాయి పెద్ద ఝలకిచ్చింది. మొదట్లో ఆమె వాదనని ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ.. ఆమె మాత్రం జయ తనకి తల్లి అని, కావాలంటే డీఎన్ఏ పరీక్షకైనా సిద్ధమని చెబుతోంది. తానేం పబ్లిసిటీ కోసం అబద్ధాలాడటం లేదని, తాను నిజంగానే జయ కూతురినని చెప్తోంది. ‘మరి.. ఇన్నాళ్లు ఎక్కడికిపోయావ్? నిజంగానే జయ కూతురివైతే నిన్ను ఎందుకు ఆమె ప్రపంచానికి పరిచయం చేయలేదు? అసలు నువ్వు జయ కూతురువి అని ఎలా తెలిసింది?’ అనే ప్రశ్నలు సంధించగా.. అమృత చాలా చిట్టానే చెప్పుకొచ్చింది.

‘‘నా పెంపుడు తల్లి చనిపోయేదాకా నేను ఆమె సొంత కూతురినే అని భావించాను. కానీ.. నా పెంపుడు తండ్రి చనిపోతూ ‘నువ్వు జయ బిడ్డవి’ అని చెప్పారు. ఈ విషయమై బంధువులను విచారిస్తే.. ‘అవును నిజమే! జయకి ఓ అమ్మాయి ఉంది. అది నువ్వే’ అని అన్నారు. జయలలిత బతికి ఉన్నప్పుడు నేను కలిసుంటే.. నన్ను గట్టిగా హత్తుకుని, ముద్దులు పెడుతూ, ఎంతో ప్రేమగా కన్నీరు పెట్టుకుని ‘నువ్వు ఎక్కడున్నా ప్రాణాలతో ఉంటే అదే చాలు’ అని చెప్పేది’’ అని అమృత అంటోంది. ఇప్పుడు ఈ వ్యవహారం తమిళనాడులో సంచలనం రేపుతోంది.

ఈ విషయమై బెంగుళూరులో ఉంటున్న జయలలిత అత్త లలితని అడగ్గా.. ‘జయకి ఓ బిడ్డ ఉన్నది నిజమే! జయకి పురుడు పోసింది కూడా మా పెద్దమ్మే. అయితే ఆ బిడ్డే అమృతా? కాదా? అనేది మాకు తెలీదు. మా వద్ద ఎలాంటి అధారాలు లేవు’’ అని సమాధానమిచ్చింది. ఈ మొత్తం వ్యవహారాం చూస్తుంటే.. అచ్చం వర్మ సినిమాలాగే చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నట్లు అనిపిస్తోంది.

Tellmeboss.net
Related posts:
భారతీయ మహిళల సిగరెట్ల వాడకంపై షాకింగ్ రిపోర్ట్
బార్ డాన్సర్‌లా బట్టలు విప్పుతూ రెచ్చిపోయిన టీచర్.. సంచలనం రేపుతున్న వీడియో
ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డ జగపతిబాబు
ఇదో వెరైటీ కేసు.. వింటే నవ్విపోదురు!!
లవర్‌ని అక్కడ కొరికింది.. దెబ్బకు చచ్చాడు!
ట్విట్టర్ సాక్షిగా.. ఆ నటుడికి ‘ఐలవ్‌యూ’ చెప్పిన శ్రీముఖి

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.