ప్రభాస్‌ను వద్దనుకుంది అందుకే!

తెలుగు స్టార్ హీరోయిన్‌గా అనుష్క ఎలాంటి ముద్ర వేసుకుందో అందరికీ తెలిసిందే. తన అందంతో పాటు అభినయంతో కూడా ఫ్యాన్స్‌ను సంపాదించిన నటిగా అనుష్క టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ చేసిన ప్రతిసినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తారు జనాలు. అయితే ఈ అమ్మడి పెళ్లిపై గతకొంతకాలంగా టాలీవుడ్‌లో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అనుష్క ఓ వార్త పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపింది.

టాలీవుడ్‌ స్టార్ హీరో ప్రభాస్‌తో అనుష్క పెళ్లిపై యాంకర్ వివరణ అడగగా అనుష్క ఓ చిరునవ్వుతో తన యాన్సర్ ఇచ్చింది. తనకు టాలీవుడ్‌ జనాలు అంటే చాలా ఇష్టం అని చెప్పింది ఆమె. తనకు ఇంతటి కీర్తి ప్రతిష్టలు రావడానికి కారణం తెలుగు జనాలే అని ఆమె చెప్పింది. ఇక తెలుగులో ప్రభాస్‌తో కలిసి ఎక్కువ సమయం నటించినందుకు ఇలాంటి డౌట్ రావడం సహజమే అని ఆమె అంటోంది. అయితే తనకు ప్రభాస్ కేవలం ఓ మంచి ఫ్రెండ్ మాత్రమే అని చెప్పింది.

తనకు నచ్చిన క్వాలిటీస్‌తో ఇప్పటివరకు ఎవరు కనిపించలేదని అంటోంది అనుష్క. ఇంతవరకు అనుష్కకి తనతో జీవితాంతం నడిచే వ్యక్తి కనిపించలేదట. అంటే ప్రభాస్ తన ఛాయిస్ కాదని అనుష్క చెప్పినట్లే.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.