పూనమ్‌కి రక్తం కారకుండా ‘కత్తి’ని తీసిన ఏపీ మంత్రి

AP Minister Kollu Ravindra Comments On Poonam Kaur

తనని ఫ్యాట్సో అన్న పాపానికి పూనమ్ కౌర్‌పై మహేష్ కత్తి చేసిన ఆరోపణలు అన్నీఇన్నీ కావు. ఏకంగా పవన్ కళ్యాణ్‌తో నాలుగో ఎఫైర్ పెట్టుకుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు.. ఆమెకి వరుసగా ఆరు ప్రశ్నలు సంధించాడు. దమ్ముంటే చర్చకి దిగిరా? అంటూ సవాళ్లు విసిరాడు. ఇందుకు ఆమె నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు కానీ.. ఇతరుల ద్వారా మాత్రం కత్తికి బుల్లెట్లు దిగుతున్నాయి. ఇప్పటికే ఆమె అన్నయ్య కత్తిని కడిగిపారేయగా.. ఇప్పుడు ఏపీ మంత్రి పూనమ్‌కి మద్దతుగా ఓ ప్రకటన చేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిఫార్స్‌తోనే ఏపీలో చేనేత వస్త్రాలకు నటి పూనమ్‌కౌర్‌ను బ్రాండ్ అంబాసిడార్‌గా నియమించారని కత్తి మహేష్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర రియాక్ట్ అయ్యారు. తాను చేనేత శాఖకు మంత్రిగా ఉన్న సమయంలో చేనేత వస్త్రాలకు సంబంధించి ఎవరినీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించలేదని, అసలు ప్రభుత్వ పరంగా అలాంటి నియామకమే జరగలేదని ఆయన అన్నారు. కొంతమంది చేనేత సంఘ సభ్యులు పవన్‌ కల్యాణ్‌ను అంబాసిడర్‌గా ఉండాలని చెప్పి ఆయనను కలిసి కోరారని.. అంతే తప్ప చేనేత వస్త్రాలకు సంబంధించి ఎవరినీ బ్రాండ్ అంబాసిడార్‌గా నియమించలేదని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

ఈ లెక్కన పూనమ్ అసలు చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ కాదన్న విషయం తేలిపోయింది. అంటే.. పూనమ్‌కి మహేష్ దింపిన ‘కత్తి’ని ఏపీ మినిస్టర్ ఏమాత్రం రక్తం రాకకుండా బయటకు తీసేశాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మహేష్ కత్తి ఎక్కడున్నాడో తెలీదు కానీ.. బయటికొచ్చాక దీనిపై ఎలా రియాక్ట్ అవుతాడో వేచి చూడాల్సిందే.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.