ఆంధ్రాలో 50 కొట్టిన ‘అరవింద సమేత’.. తారకా మజాకా!

టాలీవుడ్‌లో ప్రస్తుతం రూపొందుతున్న అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో ‘అరవింద సమేత’ ఒకటి! ఎన్టీఆర్-త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ముందునుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘అజ్ఞాతవాసి’తో త్రివిక్రమ్ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయినప్పటికీ.. అదేమీ ‘అరవింద సమేత’పై ప్రభావం చూపలేదు. పైగా.. ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్స్ రిలీజయ్యాక ఈ చిత్రానికి మరింత క్రేజ్ వచ్చింది. అందుకే.. ఈ చిత్రం అదిరిపోయే బిజినెస్ చేస్తోంది.

ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం.. ఈ చిత్రం వైజాగ్ ఏరియా మినహాయించి మొత్తం ఆంధ్రాలో రూ.40 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం! అందులో సీడెడ్ ఏరియా హక్కులకి రూ.11 కోట్లు పలికినట్లు తెలిసింది. మార్కెట్ పరంగా చూసుకుంటే.. వైజాగ్‌లోనూ ఈ మూవీ రూ.7-10 కోట్ల బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది. అంటే.. ఓవరాల్‌గా ఆంధ్రా రీజియన్‌లో ఈ చిత్రం హాఫ్ సెంచరీ కొట్టినట్లే లెక్క! ఇక ఓవర్సీస్‌లో ఆల్రెడీ రూ.12 కోట్ల డీల్ కుదిరిన విషయం తెలిసిందే! నైజాంలోనూ తారక్‌కి, త్రివిక్రమ్‌కి మంచి మార్కెట్ ఉంది కాబట్టి.. కనీసం రూ.18-20 కోట్ల బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. నాగబాబు ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని యూనిట్ ప్లాన్!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.