అరవింద సమేత రిలీజ్ డేట్ ఫిక్స్.. బాక్సాఫీస్‌ ఊచకోత ఖాయం!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తారక్ సరికొత్త అల్ట్రా స్టైలిష్ లుక్‌తో కనిపిస్తున్న ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ జనాల్లో సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో తారక్ ఇండస్ట్రీ రికార్డులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశాడు.

కాగా ఈ చిత్రం దసరా కానుకగా రిలీజ్ కానున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. దసరా సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు తారక్ అండ్ టీమ్. దసరా సెలవులు అక్టోబర్ 8 నుండి ప్రారంభం అవుతుండటంతో ఈ చిత్రాన్ని పక్కా ప్లానింగ్‌తో అక్టోబర్ 10న బరిలోకి దించుతున్నారు చిత్ర యూనిట్. దీంతో లాంగ్ వీకెండ్‌తో పాటు దసరా సెలవులను కూడా క్యాష్ చేసుకుని దుమ్ములేపే కలెక్షన్లు కొల్లగొట్టాలని చూస్తున్నారు తారక్ అండ్ టీమ్.

ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ సిక్స్ ప్యాక్ బాడీతో దర్శనమిస్తాడు. అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ టాప్‌ క్లాస్ మ్యూజిక్ అందిస్తుండగా హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.