తారక్28: మరో సెన్సేషనల్ పిక్ లీక్

పెద్ద హీరోల సినిమాలు సెట్స్ మీదకి వెళ్ళడమే ఆలస్యం.. లీకేజుల పర్వం మొదలైపోతుంది. యూనిట్ ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా సరే.. ఎలాగోలా పిక్స్‌గానీ, సీన్స్‌గానీ బయటకొచ్చేస్తుంటాయి. ఇప్పుడు తారక్ 28వ చిత్రం ‘అరవింద సమేత’ కూడా ఈ లీకేజ్ బారిన పడింది. ఇదివరకే ఈ మూవీకి సంబంధించి ఒక ఎమోషనల్ పిక్ లీకయ్యింది.

గాయాలతో పడివున్న నాగబాబుని దీనంగా చూస్తున్న తారక్ కారులో తీసుకెళ్తున్నట్లు ఆ ఫోటోలో కనిపిస్తుంది. లేటెస్ట్‌గా మరో సెన్సేషనల్ పిక్ ఒకటి బయటకొచ్చింది. ఈ ఫోటోలో తారక్ తెల్లరంగు లాల్చీలో అచ్చం సీమబిడ్డలా దర్శనమిచ్చాడు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ ఫోటోతోపాటే ఒక పెద్ద బంగ్లా సెట్‌ వున్న ఫోటో కూడా లీక్ అయ్యింది. అది పూర్తిగా రాయలసీమ వాతావరణాన్ని తలపిస్తోంది. చూస్తుంటే.. ఇందులో రాయలసీమ డోస్‌ని త్రివిక్రమ్ బాగానే పెట్టినట్లు తెలుస్తోంది.

ఇకపోతే.. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్‌ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి, దసరా కానుకనే థియేటర్లలోకి దింపాలని యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.