తారక్ దెబ్బకు రెండు పిట్టలు.. వాటే ట్విస్ట్!

సెట్స్ మీదకి వెళ్ళిన కొత్తలో ‘అరవింద సమేత’ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించిందే తప్ప.. ఆ తర్వాత మళ్ళీ ఆ ఊసే ఎత్తలేదు. ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన టైంలోనూ విడుదల తేదీపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కనీసం టీజర్‌ని ఎప్పుడు రిలీజ్ చేస్తామన్న విషయాన్ని వెల్లడించిందిలేదు. దీంతో ఈ చిత్రం వాయిదా పడొచ్చనే రూమర్స్ పుట్టుకొచ్చాయి.

ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన చాలారోజుల తర్వాత కూడా టీజర్ విడుదల చేయకపోవడం, షూటింగ్ అప్‌డేట్స్ కూడా రెగ్యులర్‌గా ఇవ్వకపోవడంతో.. బహుశా చిత్రీకరణ ఆలస్యమవుతోందని, అందుకే యూనిట్ గప్‌చుప్‌గా వుందని టాక్ చక్కర్లు కొట్టింది. దీన్ని మేకర్స్ ఖండించకపోవడంతో.. రిలీజ్ డేట్ పక్కాగా పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ వుందని బలమైన వాదనలు వినిపించాయి. ఎట్టకేలకు ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని యూనిట్ స్పష్టం చేసింది. తాము ముందుగా చెప్పినట్లుగానే దసరా కానుకగా తమ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. అంతకుముందు టీజర్ రిలీజ్ డేట్‌ని కూడా వెల్లడించింది.

తొలుత టీజర్‌ని ఆగస్ట్ 15వ తేదీన రిలీజ్ చేయబోతున్నామని హారికా&హాసినీ క్రియేషన్స్ ట్విట్టర్ మాధ్యమంగా పేర్కొంది. ఈ డేట్‌లో ఎలాంటి మార్పు వుండదని, ఏ టైంలో రిలీజ్ చేస్తామని విషయాన్ని కూడా త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. అనంతరం రిలీజ్ డేట్‌పై స్పష్టత ఇచ్చేసింది. ముందుగా చెప్పినట్లుగానే అక్టోబర్ 11వ తేదీన తమ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇన్నాళ్ళూ సైలెంట్‌గా వున్న యూనిట్.. ఉన్నట్లుండి ఇలా రెండు అప్‌డేట్స్ ఒకేసారి వెల్లడించి పెద్ద ట్విస్టే ఇచ్చిందని చెప్పుకోవచ్చు.

Related posts:
లేటెస్ట్ అప్ డేట్ : పారిస్ నుంచి వచ్చి ఊటీ వెళ్ళిన మహేష్
షాక్ : అఖిల్ డైరెక్టర్‌ను లాగేసుకున్న ఎన్టీఆర్
సునీల్, మన్నార చోప్రాల ‘జక్కన్న’ మూవీ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్
‘కురుక్షేత్రం’కి శంఖం పూరించిన రాజమౌళి..?
చిన్న గడ్డపారిస్తే కొండని తవ్విన తారక్.. అదీ నటరుద్రడి స్టామినా!
ముహూర్తం ఫిక్స్ చేసుకున్న సంఘమిత్ర!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.