స్పీడు పెంచిన వైజయంతి.. తారక్ తరువాత విక్రమ్!

గత కొంత‌ కాలంగా స‌రైన‌ హిట్ లేక సతమతమవుతున్న వైజయంతి మూవీస్ బ్యానర్ తాజాగా విడుదలైన ‘మహానటి’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేసింది. అలనాటి లెజెండరీ హీరోయిన్ సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంతో భారీ సక్సెస్‌ను అందుకుంది వైజయంతి బ్యానర్.

మహానటి అందించిన విజయంతో వరుస చిత్రాలు చేయడానికి నిర్మాత అశ్వనీదత్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే నాగార్జున, నాని హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీని నిర్మిస్తున్నారు. మరోవైపు.. మహేష్‌ బాబు 25వ చిత్రాన్ని మరో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో కలిసి నిర్మిస్తున్నారు. అంతేగాకుండా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ‘మహానటుడు’ అనే సినిమాని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు ‘ఇష్క్’, ‘మనం’, ‘24’, ‘హలో’ లాంటి చిత్రాలను తెరకెక్కించిన విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో కూడా ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇలా ఒక్క హిట్‌తో తమ స్పీడు పెంచి వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు వైజయంతి మూవీస్ బ్యానర్ వారు. మరి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రాబోయే సినిమా ఎలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుందో తెలియాలంటే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.