‘అ!’ యూఎస్ఏ కలెక్షన్స్.. బాక్సాఫీస్‌పై శివతాండవం

ఎంత భారీ అంచనాల మధ్య వచ్చినా.. బాక్సాఫీస్ మీద చిన్న సినిమాల ప్రతాపం అంతంత మాత్రంగానే వుంటుంది. కానీ ‘అ!’ చిత్రం ఆ ట్రెండ్‌ని పటాపంచలు చేస్తూ.. బాక్సాఫీస్ మీద శివతాండవం చేసింది. యూఎస్ఏలో సరికొత్త అలజడి సృష్టించింది. ప్రీమియర్స్‌తోనే అదిరిపోయే కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ చిత్రం.. ఆ తర్వాత శుక్రవారం మరింత రెచ్చిపోయింది. దీంతో.. ఒకే రోజుల్లో మొత్తం పెట్టుబడి వచ్చేసింది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. గురువారం ప్రీమియర్స్ ద్వారా $126K కలెక్ట్ చేసిన ఈ చిత్రం, శుక్రవారం $140K కొల్లగొట్టింది. దీంతో.. తొలిరోజే $266K వసూళ్ళు నమోదు చేయగలిగింది. యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని $370Kకి కొనుగోలు చేయగా.. ఈ చిత్రం అప్పుడే సగానికిపైగా రికవర్ చేసింది. ఈ వీకెండ్‌లోపు బయ్యర్స్ లాభాల్లోకి వచ్చేస్తారని అర్థం చేసుకోవచ్చు. తమ అభిరుచికి తగ్గట్టుగా ఈ చిత్రం భిన్నంగా, థ్రిల్లింగ్‌గా వుండడంతో.. అక్కడి ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. అందుకే.. చిన్న చిత్రమైనా పెద్ద సినిమా స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.