అప్పుడే ‘బాహుబలి-2’ రికార్డ్‌ని బ్రేక్ చేసింది!

baahubali 2 record broke by padmavati trailer

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి’ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఇండియన్ బాక్సాఫీస్‌ని పీల్చిపిచ్చి చేయడమే కాదు.. టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పింది. తన ఖాతాలో ఎన్నో తిరుగులేని రికార్డ్స్‌ని జమచేసుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ చిత్రం భారతదేశ చలన చరిత్రలో చెరగని మైలురాయిగా నిలిచింది. అలాంటి ఈ మూవీకి సంబంధించిన ఓ అరుదైన రికార్డ్‌ని కేవలం కొన్ని గంటల్లోనే పటాపంచలు చేసేసింది ఓ సినిమా. అసలు ‘బాహుబలి-2’ రికార్డ్స్‌ని బీట్ చేయడానికి మరే సినిమా రాదనుకుంటే.. ఆ అపోహలకు చెక్ పెడుతూ గంటల వ్యవధిలోనే ఆ మూవీ సాధించిన ఘనతని తుడిచిపారేసింది. ఆ చిత్రం ఏంటని అనుకుంటున్నారా? మరేదో కాదు.. ‘పద్మావతి’!

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రానికి సంబంధించి రీసెంట్‌గా 3 నిముషాల నిడివిగల ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కళ్లుచెదిరే గ్రాండ్ విజువల్స్, అద్భుతమైన గ్రాఫిక్స్, నటీనటుల వీరోచితమైన నటనా ప్రతిభ.. వంటివి ఆడియెన్స్ మనసుల్ని దోచుకోవడంతో దీన్ని చూసేందుకు నెటిజన్లు ఎగబడుతున్నారు. దీంతో.. ఈ ట్రైలర్ వ్యూస్ పరంగా రిమార్కబుల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఒక్క యూట్యూబ్‌లోనే ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 11.5 మిలియన్ వ్యూస్ సాధించింది. దీంతో.. అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్‌గా ఇది రికార్డుపుటలకెక్కింది. అంతకుముందు ‘బాహుబలి-2’ ట్రైలర్ 11.1 మిలియన్ వ్యూస్‌తో ఫస్ట్ ప్లేస్‌లో వుండగా.. ఆ రికార్డ్‌ని ‘పద్మావతి’ ట్రైలర్ బద్దలుకొట్టేసింది. రానున్న రోజుల్లో ఈ చిత్రం మరిన్ని రికార్స్డ్‌ని పటాపంచలు చేస్తుందని.. బాక్సాఫీస్ వద్ద కూడా సునామీ సృష్టించడం ఖాయమని విశ్లేషకులు చెప్తున్నారు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.