‘బాహుబలి-ది కన్‌క్లూజన్’ ట్రైలర్ రివ్యూ : అంతకుమించి.. కానీ!

bahubali-2-trailer-review

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బాహుబలి : ది కన్‌క్లూజన్’ ట్రైలర్ ఈరోజు ఉదయం రానే వచ్చేసింది. నిజానికి.. చిత్రబృందం ఈ ట్రైలర్‌ని తొలుత 9 గంటలకు థియేటర్లలో ప్రదర్శించాలని.. అనంతరం సాయంత్రం 5 యూట్యూబ్‌లో రిలీజ్ చేయాలని భావించింది. కానీ.. ఇంతలోనే నిర్ణయం మార్చుకుని ట్రైలర్‌ని సోషల్ మీడియాలో విడుదల చేసింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా దీని గురించే చర్చ నడుస్తోంది. అందరూ ఊహించినట్లుగానే ఉదయం నుంచి ఇటు సామాజిక మాధ్యమాల్లో, అటు మీడియాలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ ట్రైలర్ హవా నడుస్తోంది. ఇంతకీ ఈ ట్రైలర్‌లో ఏం చూపించారు? ఇది అంచనాల్ని అందుకుందా? లేదా? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి..

Also Read In English : “Bahubali – The Conclusion” Trailer Review

‘అమరేంద్ర బాహుబలి అను నేను.. అశేషమైన మాహిష్మతి ప్రజల ధన, మాన, ప్రాణ సంరక్షకుడిగా.. ప్రాణత్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌లో కళ్ళుచెదిరే విజువల్స్‌తోపాటు ప్రేమ, ఎమోషన్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ నిండుగా ఉన్నాయి. ముఖ్యంగా.. మాహిష్మతి రాజ్యానికి సంబంధించి చూపించిన లొకేషన్లు అదిరిపోయాయి. మొదటి భాగంలో కంటే మించి ఇందులో అబ్బో అనేపించేలా గ్రాఫిక్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక ఫైటింగ్ సీక్వెన్సులు ఒళ్లు గగుర్పొడిచేలా రీతిలో ఉన్నాయి. ‘నువ్వు నా పక్కన ఉన్నంతవరకూ నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా’ అని ఓ సీన్‌లో ప్రభాస్ చెప్పే డైలాగ్ వింటే రొమాలు నిక్కబొడుచుకుంటాయి. అంతకుముందు.. శివగామి పాత్ర పోషిస్తున్న రమ్యక్రిష్ణ పిల్లాడిని చేతిలో పట్టుకుని ‘అమరేంద్ర బాహుబలి’ అని రౌద్రంగా అరిచే సన్నివేశం కూడా పీక్స్. ఫైనల్‌గా.. భళ్ళాలదేవుడు, బాహుబలిని ఒక ఫ్రేమ్‌లో చూపించి ఈ ట్రైలర్‌ని రక్తి కట్టించారు. ఓవరాల్‌గా.. రాజమౌళి స్టయిల్లోనే ఈ ట్రైలర్ అదరహో అని చెప్పుకోవచ్చు.

అయితే.. ఏ అంచనాలైతే జనాలు ఈ ట్రైలర్‌పై పెట్టుకున్నారో వాటిని అందుకోవడంలో ఇది పూర్తిగా సక్సెస్ కాలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. చూస్తున్నంతసేపూ మొదటి భాగంలోని కొన్ని సన్నివేశాల్నే చూస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రభాస్-అనుష్కల మధ్య రొమాంటిక్ ట్రాక్, ప్రభాస్-రానా మధ్య ఫైట్ సీక్వెన్స్‌లు తప్ప.. మిగతాదంతా రొటీన్‌గానే ఉంది. గ్రాండ్ విజువల్స్‌కి సెల్యూట్ చెప్పుకోవచ్చు కానీ.. టోటల్‌గా ట్రైలర్ థ్రిల్లింగ్‌గా అనిపించలేదు. ఏదో మిస్ అయ్యిందన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. పైగా.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆ ట్రైలర్‌లో లీనమయ్యేలా చేయలేదు. రాజుల కాలంనాటిది కాకుండా ఏదో థ్రిల్లర్ కమ్ యాక్షన్ మూవీకి ఇవ్వాల్సిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చేశారు. ఈ మైనస్ పాయింట్స్ పక్కనపెడితే.. ట్రైలర్ మాత్రం గర్వించదగేలా ఉంది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.