మీసం మెలేసే న్యూస్.. ఆ సినిమాకు బాలయ్య సీక్వెల్!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ విషయంలో జోరు చూపిస్తున్నాడు. అయితే బాలయ్య నెక్ట్స్ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.

గతంలో బాలయ్య నటించిన బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘‘నరసింహనాయుడు’’ అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య పర్ఫార్మెన్స్‌ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో బాలయ్య తన నటవిశ్వరూపాన్ని చూపించాడు. అయితే ఇప్పుడు దాదాపు 16 ఏళ్ల తరువాత ఈ సినిమాకు సీక్వెల్‌లో నటించేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడట. రచయిత చిన్నికృష్ణ ‘నరసింహనాయుడు 2’ కధను చాలా పకడ్బందీగా తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను బాలయ్య తన 103వ చిత్రంగా చేయనున్నాడనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో జోరందుకుంది.

అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు..? బాలయ్యతో పాటు నటించే నటీనటులు ఎవరు..? ఈ చిత్రాన్ని నిర్మించేది ఎవరు..? అనే విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ చిత్రంతో బాలయ్య ఫ్యాన్స్ మాత్రం మరోసారి మీసం మెలేయడం గ్యారెంటీ!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.