బీకే కొట్టిన దెబ్బకు పీకే పరార్

balakrishna beats pawan kalyan at box office

‘అజ్ఞాతవాసి’ మూవీపై నెలకొన్న అంచనాలు చూసి.. ఈ సంక్రాంతి పోరులో పవన్ కళ్యాణ్‌దే పైచేయి అనుకున్నారంతా! అతని ధాటికి పోటీకి వచ్చే సినిమాలన్నీ మటాష్ అయిపోతాయని, వార్ వన్‌సైడ్‌గా సాగేదని భావించారు. బాలయ్యకి సంక్రాంతి సెంటిమెంట్ ఉన్నప్పటికీ.. ‘అజ్ఞాతవాసి’ క్రేజ్ ముందు ‘జై సింహా’ కొట్టుకుపోతుందని అభిప్రాయాలు వెలువడ్డాయి. తన 25వ చిత్రంతో పవన్ గత రికార్డుల్ని పటాపంచలు చేసి.. తన పేరిట ‘నాన్-బాహుబలి’ రికార్డులు లిఖించుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు సైతం పేర్కొన్నారు.

తీరాచూస్తే.. ‘అజ్ఞాతవాసి’ మూవీ ప్రేక్షకుల్ని ఏకోసాన ఆకట్టుకోలేకపోయింది. ఏ అంచనాలతో అయితే థియేటర్లకు వెళ్లారో.. అందుకు భిన్నంగా ఈ చిత్రం దెబ్బేయడంతో జనాలు దాన్ని తిప్పికొట్టారు. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్‌ల కెరీర్‌లోనే మునుపెన్నడూ రానంతగా ఈ మూవీకి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిపడ్డాయి. దీంతో.. రెండోరోజు ఈ మూవీ బాక్సాఫీస్ వత్త చతికిలపడిపోయింది. తొలిరోజు ‘నాన్-బాహుబలి’ రికార్డ్ కొల్లగొట్టినా.. రెండోరోజు నుంచి మాత్రం అత్యంత దారుణమైన వసూళ్లతో నత్తనడక నడుస్తోంది. సంక్రాంతి సెలవుల్లో పుంజుకుంటుందేమోనని భావిస్తే.. అదీ లేదు. రోజురోజుకు వసూళ్లు కిందకు దిగజారుతూనే ఉన్నాయి. దీంతో ఈ మూవీ తెలుగు ఇండస్ట్రీలోనే అతిపెద్ద డిజాస్టర్‌గా మిగలనుందని తేలిపోయింది. బయ్యర్స్ బజారుపాలు కావడం ఖాయమని స్పష్టమైంది.

ఇదే బాలయ్య ‘జై సింహా’ సినిమాకి బాగా కలిసొచ్చింది. ‘అజ్ఞాతవాసి’కి పూర్తిగా నెగెటివ్ టాక్ రావడంతో.. జనాలు బాలయ్య మూవీపై దృష్టి సారించారు. రొటీన్ కథ, 90ల కథనం అయినప్పటికీ.. ప్రేక్షకులకి కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్, ఊరమాస్ యాక్షన్ ఎపిసోడ్స్, బాలయ్య ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ పుష్కలంగా ఉండడంతో ‘సింహా’కే ‘జై’ కొట్టారు. దీంతో.. ఈ మూవీ వసూళ్లు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఇక్కడ మరో ప్లస్ పాయింట్ ఏంటంటే.. నిర్మాత చాలా ఏరియాలకు రైట్స్ అమ్మలేదు. మిగతా చోట్ల బాలయ్య మార్కెట్ వ్యాల్యూ తగ్గట్టే అమ్మాడు. కాబట్టి.. పెద్దగా నష్టాలేవీ ఉండవు. సో.. ఈసారి కూడా బాలయ్యకి ‘సంక్రాంతి’ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యిందని చెప్పుకోవచ్చు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.