బాలయ్య 100వ సినిమాలో మరో షాకింగ్ ట్విస్ట్

Balakrishna Fixed Boyapati Srinu For His 100 Movie

Balakrishna Fixed Boyapati Srinu For His 100 Movie

ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంలో మీడియాతో మాట్లాడిన నందమూరి బాలకృష్ణ.. తన 100వ చిత్రం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. క్రిష్ దర్శకత్వంలో తన వందో చిత్రం వుంటుందని.. కథాచర్చలు జరుగుతున్నాయని అన్నారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ పేరుతో క్రిష్ రాసిన ఓ కథ తనకు నచ్చిందని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.

క్రీ.పూ.1వ శతాబ్ధానికి చెందిన ‘అమరావతి’ నేపథ్యంలో ఈ సినిమా కథ వుంటుందని.. తన ప్రతిష్టాత్మక 100వ చిత్రానికి అది ఓ ప్రత్యేకత తెచ్చిపెడుతుందన్న నమ్మకంతోనే క్రిష్‌తో మూవీ చేసేందుకు బాలయ్య పచ్చజెండా ఊపినట్లు వార్తలొచ్చాయి. అయితే.. ఇప్పుడు సీన్ మారింది. బాలయ్య తన 100వ చిత్రంపై రాత్రికిరాత్రే నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. ఇండస్ట్రీవర్గాల నుంచి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. తనకు కెరీర్‌లోనే ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలతో బిగ్గెస్ట్ హిట్స్ అందించిన బోయపాటి శ్రీనుతోనే తన 100వ చిత్రం చేయాలని బాలయ్య డిసైడ్ అయినట్లు తెలిసింది. గురువారం రాత్రి జరిగిన 100వ సినిమా చర్చల క్రమంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

గతంలో తాను ‘సరైనోడు’ షూటింగ్‌లో బిజీగా వున్నానని, జూన్ వరకు వెయిట్ చేయాలని బోయపాటి చెప్పగా.. తాను అంత సమయంవరకు వెయిట్ చేయలేనని బాలయ్య ఓ ప్రెస్‌మీట్‌లో చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. తన కెరీర్‌లో అతిపెద్ద మైలురాయి అయిన 100వ సినిమా చరిత్రను తిరగరాసే విధంగా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్న బాలయ్య.. చివరికి లేట్ అయినా ఫర్వాలేదనుకుని బోయపాటినే ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అతనితో త్వరలోనే చర్చలు జరిపి.. తన 100వ చిత్రంపై బాలయ్య ప్రకటన ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే.. బాలయ్య ఫ్యాన్స్‌కి పండగే.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.