బిగ్గెస్ట్ షాక్: ఎన్టీఆర్ బయోపిక్‌కి కోర్టు నోటీసులు

పెద్ద హీరోల సినిమాలు వివాదాల్లో చిక్కుకోవడం కామనే! ఫలానా సినిమాలో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కొన్ని వర్గాలవారు రచ్చ చేయడం, కొన్నాళ్ళ తర్వాత అది సద్దుమణగడం లాంటి వ్యవహారాలు ఎప్పట్నుంచో జరుగుతూ వస్తున్నవే! కాకపోతే ఈ వివాదాలన్నీ సరిగ్గా రిలీజ్‌కి దగ్గరలో ఉన్నప్పుడు వెలుగుచూస్తాయి.

కానీ.. ఇక్కడ అసలు షూటింగ్ స్టార్ట్ కాకముందే ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిక్కుల్లో పడింది. ఇంకా నటీనటుల ఎంపిక దశలోనే ఉండగా.. దర్శకుడు క్రిష్, బాలయ్యలు నోటీసులు అందుకున్నారు. ఈ హఠాత్పరిణామానాకి కారణం ఎవరనుకుంటున్నారా? నాదెళ్ళ భాస్కరరావు కుమారుడు! ఎందుకనుకుంటున్నారా! ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు నాదేళ్ళ భాస్కర్‌రావు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వచ్చారు. కొన్నాళ్ళు సన్నిహితంగా మెలిగారు కానీ.. ఎన్టీఆర్ విదేశీ పర్యటనకు వెళ్ళనప్పుడు కాంగ్రెస్ అండదండలతో ఆయనకు వెన్నుపోటు పొడిచి.. నాదేళ్ళ సీఎం కుర్చీని అధిరోహించారు.

ఈ విషయాన్నే ఎన్టీఆర్ బయోపిక్‌లో తన తండ్రిని ఎక్కడా నెగెటివ్ షేడ్స్‌తో చూపిస్తారేమోనన్న భయంతో నాదేళ్ళ కుమారుడు ఆ చిత్రబృందానికి నోటీసులు జారీ చేశాడు. తమని సంప్రదించకుండానే ఈ సినిమా ఎలా తీస్తారంటూ ప్రశ్నించారు. మరి.. ఈ నోటీసులపై ఎన్టీఆర్ యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Related posts:
ఐసీయూలో నాని హీరోయిన్‌
చిరంజీవి పెద్ద కొడుకును నేనే...కావాలంటే DNA టెస్టులు చేసుకోండి : సుజిత్
సంతానం కోసం భార్యపై అత్యాచారం చేయించిన కీచకుడు
యాక్సిడెంటులో యంగ్ హీరో మృతి.. షాక్‌లో ఫ్యాన్స్!
బరితెగించిన పూనం.. ‘గర్ల్ పవర్’ అంటూ అండర్‌వేర్‌లో రెచ్చిపోయింది
‘ఛీ’ పని చేసిన గజల్ శ్రీనివాస్.. వెంటనే అరెస్ట్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.