‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్‌పై బాలయ్య ‘సింహా’గర్జన.. అంత సీన్ లేదట!

balakrishna sensational comments on pawan kalyan

ఇద్దరి హీరోల సినిమాలు ఒకేసారి రిలీజైనప్పుడు.. ఒకరి మూవీపై మరొకరు ఎలాంటి కామెంట్స్ చేసుకుంటారనే క్యూరియాసిటీ ప్రతిఒక్కరిలోనూ ఉంది. గతంలో ఇలాంటి విషయాలపై అందరు హీరోలు పాజిటివ్‌గానే స్పందించారు. తమ చిత్రంతోపాటు పోటీగా రిలీజైన వేరే హీరోల మూవీలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నామని తెలిపిన దాఖలాలు ఉన్నాయి. వీరిలో బాలయ్య పేరు కూడా ఉందిలెండి. కానీ.. ఈసారి బాలయ్య మాత్రం చాలా డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యారు. పేరైతే చెప్పలేదు కానీ.. ఆయన మాటలు మాత్రం పరోక్షంగా పవన్‌ని టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతోంది. తన చిత్రం ‘జై సింహా’ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం, ‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్ కావడంతో.. పవన్‌ని ఉద్దేశిస్తూ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

బాలయ్య మాట్లాడుతూ.. ‘‘అందరూ రాజకీయాల్లో, సినిమాల్లో రాణించలేరు. అది కేవలం నందమూరి హీరోలకు మాత్రమే సాధ్యం. నాడు మా నాన్నగారు ఎన్టీఆర్, నేడు నేను.. రాజకీయాల్లో, సినిమాల్లో రాణిస్తున్నాం. నేను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో చాలా విమర్శలు వచ్చాయి కానీ నిలదొక్కుకున్నా! అటు హిందుపురం ఎమ్మెల్యేగా ప్రజల కష్టాలు తీరుస్తూనే అభివృష్టి చేస్తున్నాను. ఇటు సినిమాల్లోనూ రాణిస్తున్నా. గత సంక్రాంతి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ఇప్పుడు ‘జైసింహా’తో హిట్ కొట్టా’’ అని చెప్పుకొచ్చారు. ఈ మాటలు వింటే.. ఇండైరెక్ట్‌గా పవన్‌ని బాలయ్య టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతుంది. దీంతో.. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అటు ఇండస్ట్రీలో, ఇటు పాలిటిక్స్‌లో దుమారం రేపాయి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.