ఫేడ్‌ఔట్ డైరెక్టర్‌తో ఊపు.. బాలయ్య నిజంగానే తోపు!

నందమూరి నటసింహం బాలయ్య పూర్తి ఆకలి మీద ఉన్నాడు. ఇదిలా ఉండగా, బాలయ్య నెక్ట్స్ మూవీ గురించి ఓ అదిరిపోయే న్యూస్ వినిపిస్తోంది.

బాలయ్య తన 103వ చిత్రం ఎవరితో తీస్తాడా అనే ప్రశ్న ప్రేక్షకుల్లో మొదలయ్యింది. దీంతో ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటో తెలుసుకోవాలని చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. వీరికి సమాధానం దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి రూపంలో దొరికింది. బాలయ్యకు గతంలోనే ఓ సోషో-ఫ్యాంటసీ కథను వినిపించిన కృష్ణారెడ్డి ఇప్పుడు అదే కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి సినిమా తీసేందుకు రెడీ అయ్యాడు. బాలయ్య కూడా ఫైనల్ స్క్రిప్ట్ విని ఓకే అన్నాడట. ఇక జైసింహా చిత్రం రిలీజ్ అయ్యేలోపే ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభానికి రెడీ అవుతున్నారు చిత్ర యూనిట్.

మరి ఓ ఫేడ్‌ఔట్ డైరెక్టర్‌తో కూడా జంకకుండా సినిమా చేసేందుకు రెడీ అయిన బాలయ్యను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు ప్రేక్షకులు. బాలయ్య నిజంగానే తోపు అని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను సాధిస్తుందో చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.