‘జై సింహా’ని కాపాడిన బాలయ్య ఫ్యాన్స్.. బొమ్మ భలే తిరిగేశారుగా!

Tellmeboss.net

తమ అభిమాన హీరో ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా ఫ్యాన్స్ చేసే స్టంట్స్ అన్నీఇన్నీ కావు. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ ప్లాట్‌ఫార్మ్‌లో అయినా తమ హీరోనే బెస్ట్ అని పరువు నిలబెట్టేందుకు నానా తంటాలు పడతారు. ఇక సినిమా రిలీజ్ టైంలో వీళ్లు చేసే సందడికి అసలు హద్దూఅదుపూ ఉండదు. జనాలు బాగోలేదన్నా.. దాన్ని ఖాతరు చేయకుండా పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిపడేస్తారు. తమ హీరో మూవీ బాగుందని విస్తృతంగా ప్రచారం చేస్తారు. ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ అదే స్ట్రాటజీని ఫాలో అవుతూ ‘జై సింహా’కి పాజిటివ్ బజ్ స్ర్పెడ్ చేస్తున్నారు. అసలు వాళ్లు వేసిన స్కెచ్ చూస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

Tellmeboss.net

ఎక్కడైనా సినిమా షోలు పడ్డాక టాక్ ఎలా ఉందో చెప్తారు కానీ బాలయ్య ఫ్యాన్స్ ఇంకా బెనిఫిట్ షోలు పడకముందే సినిమా చాలా బాగుందంటూ పుకారుకి తెరలేపారు. అంతేకాదు.. సోషల్ మీడియాలోనూ మూవీ బాగుందంటూ ఆర్టికల్స్ మీద ఆర్టికల్స్ రాయించారు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు కొన్ని వెబ్‌సైట్లు. థియేటర్‌లో బొమ్మ పడకముందే ‘అట అట’ ‘జై సింహా’కి పాజిటివ్ వాతావరణం క్రియేట్ చేశారు. కొన్ని వెబ్‌సైట్లు మైనస్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయంటూనే 3.5/5 రేటింగ్ ఇచ్చారు. అది చూసి జనాలు థియేటర్లకి ఎగబడుతున్నారు. నిజానికి.. ఈ చిత్రం ఏం బాగోలేదంటూ చాలామంది క్రిటిక్స్ పెదవి విరిచారు. 90 స్టైల్లో ఇదో పాత రొడ్డకొట్టుడు మూవీ అంటూ కామెంట్స్ చేశారు.

కత్తి మహేష్ అయితే ఏకంగా సింహాన్ని లేవకుండా పొడిచేశాడు. ఇది చాలా చెత్త సినిమా అంటూ రివ్యూ ఇచ్చాడు. అయితే.. ఆ నెగెటివిటీ జనాలపై ప్రభావం చూపకముందే ఫ్యాన్స్ తమ అభిమాన హీరోకి అండగా ఉంటూ ‘జై సింహా’కి హిట్ టాక్ వచ్చేలా చేశారు. ఎంత బాగా బొమ్మ తిరిగేశారు కదా. బాలయ్య ఫ్యాన్సా మజాకా!

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.