ఎన్టీఆర్‌కు డేట్ ఫిక్స్ చేసిన బాలయ్య

Tellmeboss.net

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. భుజానికి సర్జరీ చేయించుకుని రెస్ట్ తీసుకుంటున్న బాలయ్య ఎన్టీఆర్ చిత్రాన్ని చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకోవడంతో ఆ సినిమా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే ఎప్పుడెప్పుడు ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందా అని చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.

Tellmeboss.net

నందమూరి తారక రామారావు జీవితాన్ని తనకు తెలిసిన విధంగా మరెవ్వరికీ తెలియదని బాలయ్య గతంలోనే చెప్పాడు. అవే విషయాలను ‘‘ఎన్టీఆర్’’ బయోపిక్ చిత్రంలో చూపించనున్నాడు బాలయ్య. ఇందుకోసం భారీ స్థాయిలో సిద్ధమవుతోంది ఎన్టీఆర్ చిత్ర యూనిట్. హాలీవుడ్ టెక్నీషియన్స్‌‌తో బాలయ్య ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్, క్యాస్టింగ్ పనులు కంప్లీట్ కావడంతో ఈ చిత్రాన్ని ఉగాది రోజున అఫీషియల్‌గా లాంఛ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశాడు బాలయ్య. జూన్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్‌ స్టార్ట్ చేయనున్నారు చిత్ర యూనిట్.

ఈ చిత్రాన్ని బాలయ్య స్వయంగా బ్రహ్మతేజ బ్యానర్‌పై నిర్మించనున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే ఈ ప్రెస్టీజయస్ మూవీ కోసం యావత్ టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tellmeboss.net
Related posts:
‘ధూమ్:4’లో కొత్త హీరో.. విలన్ కన్ఫర్మ్.. మెగాస్టర్ కొడుకు ఔట్!!
ఎఫైర్లపై మెగా ‘పంచ్’.. వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!
సెక్స్ వర్కర్‌గా మారిన రజనీకాంత్ కూతురు
రికార్డ్ స్థాయిలో ‘జయ జానకి నాయక’ బిజినెస్.. దటీజ్ బోయపాటి క్రేజ్!
మళ్లీ వస్తున్న జై లవకుశ.. పార్ట్ 2 అదుర్స్!
రామ్ కోసం రాజు టీమ్.. పక్కా లోకల్ బ్యాచ్!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.