భాగమతి సెన్సార్ రిపోర్ట్.. ఒక్కటి కూడా లేదట!

Tellmeboss.net

టాలీవుడ్ బ్యూటీ అనుష్క నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భాగమతి’ ప్రస్తుతం అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ మొదలుకొని టీజర్ వరకు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఆడియెన్స్. ఇక తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యూ/ఎ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. అంతేగాక ఈ చిత్రంలో వారు ఒక్క కట్ కూడా చేయకపోవడం విశేషం.

Tellmeboss.net

భాగమతి చిత్రం చూసిన సెన్సార్ బోర్డు వారు ఈ చిత్ర దర్శకనిర్మాతలకు మంచి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం చాలా బాగా వచ్చిందని వారు అభినందించారట. చిత్ర కథాకథనం అదిరిపోయిందని, అనుష్క నటన ఈ చిత్రానికే హైలైట్‌గా నిలుస్తుందని వారు చెప్పారు. ఈ సినిమా ఫస్టాఫ్‌ మొత్తం ముఖ్య కథను తెలుపడానికి వాడగా సెకండాఫ్ మాత్రం ఇరగదీశారని తెలుస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఒక 20 నిమిషాలు గూస్‌బంప్స్ రావడం ఖాయమని వారు అంటున్నారు. ఈ 20 నిమిషాల్లో అనుష్క నటన మన మతిపోగొట్టడం ఖాయం అని తెలుస్తోంది.

ఇలా భాగమతి గురించి సెన్సార్ బోర్డు వారు పూర్తిగా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగిపోయారు. భాగమతి చిత్రానికి అశోక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని రిపబ్లిక్‌ డే కానుకగా జనవరి 26న రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. మరి ఈ ఏడాదిలో మొదటి హిట్ అనుష్క పేరుతో మొదలవుతుందేమో చూడాలి.

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.