భాగమతి 50 కొట్టింది!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ భాగమతి బాక్సాఫీస్ వద్ద చెడుగుడు ఆడుతోంది. జనవరి 26న రిలీజ్ అయిన ఈ సినిమా థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కడంతో ప్రేక్షకులను భీబత్సంగా ఆకర్షించింది. ఈ సినిమాలో అనుష్క భాగమతిగా చేసిన యాక్టింగ్‌కు పట్టం కట్టారు ఆమె ఫ్యాన్స్. ఇక కలెక్షన్స్ పరంగా కూడా భాగమతి చాలా స్ట్రాంగ్‌గా దూసుకెళుతోంది. ఇక ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్స్ చూసి స్టార్ హీరోలు సైతం అవాక్కవుతున్నారు.

ముఖ్యంగా భాగమతి చిత్రానికి ఓవర్సీస్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అంతేగాక అక్కడ ఈ సినిమా ఏకంగా మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఎంటర్ కావడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ఈ రేంజ్‌లో కలెక్షన్స్ కొల్లగొట్టడంతో ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికవరకు 50 కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేసి కొత్త రికార్డును క్రియేట్ చేసింది. 30 కోట్ల షేర్‌తో అనుష్క భాగమతి కలెక్షన్స్ భరతం పడుతుండటంతో చిత్ర యూనిట్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా ఇంతటి విజయం సాధించడం వారి కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని సంతోషపడుతున్నారు అనుష్క అండ్ బ్యాచ్.

అశోక్ డైరెక్ట్ చేసిన భాగమతి చిత్రానికి థమన్ సంగీతం అందించగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం సక్సెస్‌ టూర్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం టోటల్ రన్‌లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.