‘భాగమతి’ వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. దంచికొట్టిన అనుష్క

తనని లేడీ సూపర్‌స్టార్‌గా ఎందుకు అభివర్ణిస్తారో అనుష్క శెట్టి మరోసారి రుజువు చేసుకుంది. తన లేటెస్ట్ మూవీ ‘భాగమతి’తో సింగిల్ హ్యాండ్‌గా బాక్సాఫీస్‌ని ఓ కుదుపు కుదిపేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిపింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా టోటల్ రన్‌లో రూ.27.58 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ కొల్లగొట్టింది. ఇది కేవలం ఒక్క తెలుగులోనే ఈ మొత్తం రాబట్టింది. రూ.20 కోట్లలోపే థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. అంతకుమించి కలెక్షన్ల సునామీ సృష్టించి, బయ్యర్లను లాభాల్లో ముంచెత్తింది.

ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ హారర్ – థ్రిల్లర్ ఆకట్టుకోవడం.. అనుష్క అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో మెప్పించడంతో.. ఈ చిత్రం ఇలా వసూళ్ళ వర్షం కురిపించింది. కానీ.. తమిళంలో మాత్రం ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. అక్కడ రూ.7 కోట్ల మేర బిజినెస్ చేసిన ఈ చిత్రం కేవలం రూ.4.99 కోట్ల షేర్ రాబట్టి.. రూ.2 కోట్ల నష్టాలు మిగిల్చింది. ఏరియాలవారీగా క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..

నైజాం : 8.04
సీడెడ్ : 2.93
ఉత్తరాంధ్ర : 2.64
ఈస్ట్ గోదావరి : 1.65
గుంటూరు : 1.57
కృష్ణా : 1.42
వెస్ట్ గోదావరి : 1.10
నెల్లూరు : 0.87
ఏపీ+తెలంగాణ : రూ.20.22 కోట్లు
కర్ణాటక : 2.74
రెస్టాఫ్ ఇండియా : 0.60
ఓవర్సీస్ : 4.02
టోటల్ వరల్డ్‌వైడ్ షేర్ : 27.58

తమిళ్ క్లోజింగ్ కలెక్షన్స్ : (కోట్లలో)
తమిళనాడు : 3.94 (8.81)
రెస్టాఫ్ ఇండియా : 0.35 (0.95)
ఓవర్సీస్ : 0.70 (1.77)
టోటల్ వరల్డ్‌వైడ్ షేర్ : రూ.4.99 కోట్లు (గ్రాస్ : రూ.11.53 కోట్లు)

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.