భరత్ అనే నేను 25 డేస్ కలెక్షన్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. బ్రహ్మోత్సవం, స్పైడర్ వంటి రెండు డిజాస్టర్ సినిమాల తరువాత మహేష్ నటించిన భరత్ అనే నేను చిత్రంపై మహేష్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం భారీ అంచనాలు పెట్టుకున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యింది. దీంతో ఈ సినిమాకు జనాలు నీరాజనాలు పడుతున్నారు.

అదిరిపోయే కథతో మహేష్ చేసిన తనదైన యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. ఇప్పటికే ఈ చిత్రం పలు కొత్త రికార్డులు నెలకొల్పింది. తాజాగా 25 రోజులు పూర్తి చేసుకున్న భరత్ అనే నేను ప్రపంచవ్యాప్తంగా రూ. 93 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. టోటల్ రన్‌లో ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందా అని ఆతృతగా చూస్తున్నారు ట్రేడ్ వర్గాలు. మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించగా డివివి దానయ్య ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఇక ఏరియాలవారీగా ఈ చిత్రం 25 రోజులు వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – 25 డేస్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 18.60 కోట్లు
సీడెడ్ – 9.75 కోట్లు
ఉత్తరాంధ్ర – 8.61 కోట్లు
గుంటూరు – 8.25 కోట్లు
ఈస్ట్ గోదావరి – 6.80 కోట్లు
వెస్ట్ గోదావరి – 4.22 కోట్లు
కృష్ణా – 4.87 కోట్లు
నెల్లూరు – 2.60 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 63.87 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 10.70 కోట్లు
ఓవర్సీస్ – 18.60 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 93.17 కోట్లు

Related posts:
సిద్ధార్థ, త్రిష, హన్సికల ‘కళావతి’ మూవీ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్
మహేష్, ఎన్టీఆర్‌లతో పూరీ రాసుకున్న రికార్డుల లెక్క..?
నాన్న కాని నాన్న బాలయ్య.. వివరించి చెప్పిన నయనతార!
‘నా పేరు సూర్య’ ఇంపాక్ట్ రివ్యూ-రేటింగ్.. ఆ రూమర్లకి బుల్లెట్ దిగింది!
చరిత్ర సృష్టించిన ‘రంగస్థలం’.. బద్దలైన ‘ఖైదీ’ గోడలు
అంత అమౌంట్ ఇస్తేనే.. మూడొస్తుందంటున్న దేవిశ్రీ!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.